Story highlights
- పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు.
- బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
- ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అలవర్చుకోవాలని సూచించారు.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఉదయగిరి ఆర్టీసీ డిపో మేనేజర్ పేర్కొన్నారు. బ్రిక్స్ సుస్థిర జీవనశైలి వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయగిరి ఆర్టీసీ డిపోలో ఒక్కసారి మాత్రమే వినియోగించే ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలపై ఉద్యోగులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను అలవర్చుకోవాలని సూచించారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఉద్యోగులందరూ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగానికి దూరంగా ఉంటామని, సుస్థిర జీవనశైలి పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు.