విశాఖపట్నం, అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)
మహిళా వరల్డ్‌కప్ క్రికెట్ మ్యాచ్‌లలో భాగంగా విశాఖ ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ సందర్భంగా ఐసిసి, బిసిసిఐ ప్రతినిధులను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) తరఫున ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్, ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ (చిన్ని), సెక్రటరీ సానా సతీష్ బాబు పాల్గొన్నారు.
మ్యాచ్‌కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఐసిసి చైర్మన్ జైషాకు మంత్రి నారా లోకేష్ ఏసీఏ తరఫున జ్ఞాపిక బహుకరించి శాలువా కప్పి సత్కరించారు. అనంతరం ఐసిసి సీఈఓ సంజోగ్ గుప్తాకు కూడా జ్ఞాపికను అందజేశారు.
అలాగే బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్, సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్ తేజ్ భాటియా, క్రికెట్ ఆస్ట్రేలియా చైర్మన్ మైక్ బైర్డ్, సీఈఓ తొటాడ్ గ్రీన్బర్గ్లను ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు జ్ఞాపికలు అందజేశారు.
ఈ సందర్భంగా ఐసిసి చైర్మన్ జైషా, బిసిసిఐ ప్రెసిడెంట్ మిథున్ మన్హాస్ మాట్లాడుతూ — విశాఖ స్టేడియంలోని వేదిక, ఏర్పాట్లు, ప్రేక్షకుల ఉత్సాహం అత్యంత ప్రోత్సాహకరంగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
మహిళా క్రికెట్‌ను ప్రోత్సహించే కార్యక్రమంలో పాల్గొన్న ఐసిసి, బిసిసిఐ ప్రతినిధులకు ఏసీఏ తరఫున మంత్రి నారా లోకేష్, అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.


