Thursday, 9 April 2026
  • Home  
  • ఐదు ఎకరాల వరికి అష్టదిగ్బంధనం – పంటకు దారి మూసివేత
- అన్నమయ్య

ఐదు ఎకరాల వరికి అష్టదిగ్బంధనం – పంటకు దారి మూసివేత

-ప్రభుత్వ భూమిపైనా అడ్డంకులు – రైతుకు రాకపోకల నిషేధం -విన్నపాలు వినిపించని రెవెన్యూ యంత్రాంగం – కాలయాపనతో నష్టం -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” రైతు కన్నీటి గాథ వ్యవసాయం చేసి పంట పండించడం ఒక పెద్ద కష్టమైతే… పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లడం మరింత కష్టంగా మారిన ఘటన చిట్వేలి మండలంలో వెలుగుచూసింది. ఈడిగపల్లె గ్రామానికి చెందిన రైతు మీసాల శ్రీనివాసులు ఐదు ఎకరాల్లో వరి పంట పండించినా, దానిని ఇంటికి తరలించే దారిని అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో మాలే మార్పురం చెరువు కింద ఉన్న తన మాగాణిలో వరి సాగు చేసిన ఈ రైతు, మంచి దిగుబడి రావడంతో కొంత ఊరట పొందాడు. కానీ కోత ప్రారంభించిన సమయంలోనే అనూహ్యంగా సమస్యలు ఎదురయ్యాయి. పంటను నూర్పించి ఇంటికి తరలించేందుకు యంత్రాన్ని తీసుకురాగానే, అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారిని అడ్డుకుని ‘ఈ దారిలో రాకపోకలు చేయరాదు’ అంటూ అడ్డుకోవడం పరిస్థితిని క్లిష్టతరం చేసింది. -విన్నపాలు వినిపించని అధికార యంత్రాంగం సమస్య పరిష్కారం కోసం రైతు స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడం బాధాకరం. ఫిర్యాదు చేసినా, అది కేవలం విఆర్ఓకి బదిలీ చేయడానికే పరిమితమైందని రైతు ఆరోపిస్తున్నాడు. విఆర్ఓ ఒకసారి సర్వే చేస్తానని, మరోసారి వేరే సూచనలు ఇస్తూ కాలయాపన చేస్తున్నాడని వాపోతున్నాడు.ఇంతలో, పొలంలో ఉన్న వరి పంట క్రమంగా నేలకూలిపోతోంది. వర్షం పడితే పూర్తిగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. రైతు కళ్లముందే తన శ్రమ వృథా అవుతుండగా, అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -ప్రభుత్వ భూమిపైనా ‘అడ్డంకుల రాజ్యం’ పొలానికి వెళ్లే దారి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత హక్కుల పేరుతో అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. చెరువు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు పెరిగి, ఇతర రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.శ్రీనివాసులు తన పంటను తరలించేందుకు ప్రయత్నించగా, అదే దారిలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం. ఇది కేవలం ఒక రైతు సమస్య మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న భూవివాదాలకు ప్రతీకగా మారింది. -“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” ఈ ఘటనపై రైతు మీసాల శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,“నేను చిన్న రైతును. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం లేదు. అప్పులు చేసి వరి సాగు చేశాను. పంట పండింది. కానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో కూడా వెళ్లొద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను పంట వదిలేయాలా..? లేక ప్రాణం తీసుకోవాలా..?” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.అతను ఇంకా మాట్లాడుతూ, “తహసీల్దార్ స్పందించడం లేదు. విఆర్ఓ గ్రామంలో రాజకీయాలు చేస్తున్నాడు. పై అధికారులు వెంటనే జోక్యం చేసుకోకపోతే రైతుగా నేను బతకలేను” అని వేదన వ్యక్తం చేశాడు. -వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పండించిన పంటను ఇంటికి తెచ్చుకునే హక్కు కూడా లేకుండా రైతు ఇబ్బందులు పడటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారింది.ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

-ప్రభుత్వ భూమిపైనా అడ్డంకులు – రైతుకు రాకపోకల నిషేధం

-విన్నపాలు వినిపించని రెవెన్యూ యంత్రాంగం – కాలయాపనతో నష్టం

-“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?” రైతు కన్నీటి గాథ

వ్యవసాయం చేసి పంట పండించడం ఒక పెద్ద కష్టమైతే… పండించిన పంటను ఇంటికి తీసుకెళ్లడం మరింత కష్టంగా మారిన ఘటన చిట్వేలి మండలంలో వెలుగుచూసింది. ఈడిగపల్లె గ్రామానికి చెందిన రైతు మీసాల శ్రీనివాసులు ఐదు ఎకరాల్లో వరి పంట పండించినా, దానిని ఇంటికి తరలించే దారిని అడ్డుకోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సుమారు రూ.1.50 లక్షల వ్యయంతో మాలే మార్పురం చెరువు కింద ఉన్న తన మాగాణిలో వరి సాగు చేసిన ఈ రైతు, మంచి దిగుబడి రావడంతో కొంత ఊరట పొందాడు. కానీ కోత ప్రారంభించిన సమయంలోనే అనూహ్యంగా సమస్యలు ఎదురయ్యాయి. పంటను నూర్పించి ఇంటికి తరలించేందుకు యంత్రాన్ని తీసుకురాగానే, అదే గ్రామానికి చెందిన వ్యక్తి దారిని అడ్డుకుని ‘ఈ దారిలో రాకపోకలు చేయరాదు’ అంటూ అడ్డుకోవడం పరిస్థితిని క్లిష్టతరం చేసింది.

-విన్నపాలు వినిపించని అధికార యంత్రాంగం

సమస్య పరిష్కారం కోసం రైతు స్థానిక తహసీల్దార్‌ను ఆశ్రయించినప్పటికీ, స్పందన లేకపోవడం బాధాకరం. ఫిర్యాదు చేసినా, అది కేవలం విఆర్ఓకి బదిలీ చేయడానికే పరిమితమైందని రైతు ఆరోపిస్తున్నాడు. విఆర్ఓ ఒకసారి సర్వే చేస్తానని, మరోసారి వేరే సూచనలు ఇస్తూ కాలయాపన చేస్తున్నాడని వాపోతున్నాడు.ఇంతలో, పొలంలో ఉన్న వరి పంట క్రమంగా నేలకూలిపోతోంది. వర్షం పడితే పూర్తిగా నష్టం కలిగే ప్రమాదం ఉంది. రైతు కళ్లముందే తన శ్రమ వృథా అవుతుండగా, అధికారుల నిర్లక్ష్యం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.

-ప్రభుత్వ భూమిపైనా ‘అడ్డంకుల రాజ్యం’

పొలానికి వెళ్లే దారి రికార్డుల ప్రకారం ప్రభుత్వ భూమిగా ఉన్నప్పటికీ, కొంతమంది వ్యక్తులు వ్యక్తిగత హక్కుల పేరుతో అడ్డుకోవడం వివాదానికి కారణమైంది. చెరువు ఆయకట్టు పరిధిలోని ప్రాంతాల్లో అక్రమ ఆక్రమణలు పెరిగి, ఇతర రైతులకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.శ్రీనివాసులు తన పంటను తరలించేందుకు ప్రయత్నించగా, అదే దారిలో రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం గమనార్హం. ఇది కేవలం ఒక రైతు సమస్య మాత్రమే కాకుండా, గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతున్న భూవివాదాలకు ప్రతీకగా మారింది.

-“పైరు వదిలేయాలా..? ప్రాణం తీసుకోవాలా..?”

ఈ ఘటనపై రైతు మీసాల శ్రీనివాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ,“నేను చిన్న రైతును. వ్యవసాయం తప్ప మరో జీవన మార్గం లేదు. అప్పులు చేసి వరి సాగు చేశాను. పంట పండింది. కానీ దాన్ని ఇంటికి తీసుకెళ్లడానికి కూడా అడ్డంకులు వస్తున్నాయి. ప్రభుత్వ భూమిలో కూడా వెళ్లొద్దంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో నేను పంట వదిలేయాలా..? లేక ప్రాణం తీసుకోవాలా..?” అంటూ కన్నీటి పర్యంతమయ్యాడు.అతను ఇంకా మాట్లాడుతూ, “తహసీల్దార్ స్పందించడం లేదు. విఆర్ఓ గ్రామంలో రాజకీయాలు చేస్తున్నాడు. పై అధికారులు వెంటనే జోక్యం చేసుకోకపోతే రైతుగా నేను బతకలేను” అని వేదన వ్యక్తం చేశాడు.

-వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం

రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వం పదేపదే సూచనలు చేస్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉందని ఈ ఘటన స్పష్టంగా చూపిస్తోంది. పండించిన పంటను ఇంటికి తెచ్చుకునే హక్కు కూడా లేకుండా రైతు ఇబ్బందులు పడటం వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనంగా మారింది.ఈ సమస్యపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి రైతుకు న్యాయం చేయాలని స్థానికులు, రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఇలాంటి సంఘటనలు మరింత పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.