విశాఖ ఐటీని ప్రపంచవ్యాపితం చేస్తున్న ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కు యువ నాయకుడు, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తనయుడు గంటా రవితేజ కృతజ్ఞతలు తెలిపారు. విశాఖ పర్యటనకు వచ్చిన ఆయనకు రవితేజ ఆదివారం ఎయిర్ పోర్టులో మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా విశాఖ అభివృద్ధికి ప్రభుత్వం కనబరుస్తున్న ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావించారు. రూ.56 వేల కోట్లతో గూగుల్ డేటా సెంటర్.. రూ. 85 వేల కోట్లతో రైడెన్ డేటా సెంటర్.. రూ. 16 వేల కోట్లతో సిఫీ డేటా సెంటర్ ఏర్పాటయ్యేలా చేసినందుకు లోకేష్ కు అభినందనలు తెలియజేశారు. త్వరలో ఏర్పాటు కానున్న టీసీఎస్.. కాగ్నిజెంట్.. యాక్సెంచర్.. వంటి కంపెనీలు వేలాది మంది యువతకు పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తాయని పేర్కొన్నారు.

ఐటీ విశ్వనగరంగా విశాఖ మంత్రి లోకేష్ కు గంటా రవితేజ కృతజ్ఞతలు