ఐజ పట్టణ కేంద్రంలో ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు
గద్వాల్ నవంబర్ 8 (పున్నమి ప్రతినిధి)
ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ SA సంపత్ కుమార్ గారి ఆదేశానుసారం ఈరోజు ఐజ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షులు ఉత్తనూర్ జయన్న అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు గౌరవ శ్రీ *ఎనుముల రేవంత్ రెడ్డి గారి* జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.
⚡రేవంత్ రెడ్డి గారి వేడుకలను పురస్కరించుకొని ఐజ మండల మరియు పట్టణంలోని ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి పెద్ద సంఖ్యలో చేరుకొని కేకులు కట్ చేసి స్వీట్లు పంచుకొని రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని , ఆయన అనుసరిస్తున్న ప్రజా పాలన విధానాన్ని నినాదాలతో కొనియాడారు.
⚡ఈ కార్యక్రమంలో సింగిల్ విండో మాజీ చైర్మన్ సంకాపురం రాముడు సీనియర్ ఎక్స్ ఎంపిటిసి R శ్రీధర్, , SC సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్ మద్దిలేటి , మాజీ కౌన్సిలర్లు గిత్తల దేవరాజు ,ఆంజనేయులు,అధికార ప్రతినిధి మైనర్ బాబు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాలి రెడ్డి భూమి పురం నరసింహారెడ్డి, తిమ్మారెడ్డి , ఉప్పల తిప్పన్న, దేవేంద్ర,మహేష్ , సోషల్ మీడియా ఇంచార్జ్ లాల్ గౌడ్ ,రవీందర్ , శంకర్ గౌడ్ ,మాజీ సర్పంచ్లు భాస్కర్ గౌడ్ ,లక్ష్మన్న, నాయకులు కృష్ణారెడ్డి ,రఘు గౌడ్, తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


