పున్నమి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా అక్టోబర్ 9
ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కారం కావాలంటే ఉపాధ్యాయ సంఘాలు సమైక్య పోరాటానికి సిద్ధం కావాలని అప్పుడే పెండింగ్ బిల్లులు, ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధించబడతాయని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం (ఎస్. టి. యు) జిల్లా అధ్యక్షులు ఎస్మురళి, ప్రధాన కార్యదర్శి కొత్త శ్రీధర్ రావులు అన్నారు. గురువారం వెల్దండ మండలం కొట్ర, వెల్దండ, గుండాల, చేదురుపల్లి, దేశి గాని తండ, అగ్రహారం తండ, చారగొండ మండలంలోని శాంతి గూడ, చారగొండ, జూపల్లి ఉన్నత ,ప్రాధమిక పాఠశాలలను సందర్శించి ఉపాధ్యాయ సంఘ సభ్యత నమోదు చేయించినట్లు మండల అధ్యక్ష కార్యదర్శులు చెన్నకేశవులు, మల్లేష్, నాయకులు అమరేందర్ రావు, పత్యనాయక్, అశోక్, మధుసూదన్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలలలో వారు మాట్లాడుతూ ఏకీకృత సర్వీసు రూల్స్ సాధించబడితే ఎంఈఓ, జేఎల్, డిప్యూటీ డిఈఓ ల పదోన్నతులకు మార్గం ఏర్పడుతుందని, ఇంకా ఐదు పెండింగ్ డీ ఏ లు చెల్లించి, పి ఆర్ సి ని ప్రకటించాలని, సి.పి.ఎస్ రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఉపయోగపడని శిక్షణలతో ఉపాధ్యాయుల బోధనకు ఆటంకం కలిగించవద్దని అధికారులను కోరినారు.


