పున్నమి ప్రతినిధి
అక్టోబర్ 13
ఇంటిగ్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మేనేజ్‌మెంట్ (ఐ ఐ ఎ ఎం) బిజినెస్ స్కూల్, నావల్ డాక్‌యార్డ్, విశాఖపట్నం సహకారంతో, నావల్ డాక్‌యార్డ్ ఫోర్‌మన్ మరియు చార్జ్‌మన్‌ల కోసం “కోర్ కంపెటెన్సీస్ డెవలప్మెంట్” అనే అంశంపై 10రోజుల ట్రైనింగ్-కమ్ వర్క్‌షాప్‌ను సోమవారం ఎం వీ పీ కోలనీలోగల ఐ ఐ ఎ ఎం ఆడిటోరియంలో విశాఖ చాప్టర్, కార్యదర్శి డా. బి. కృష్ణ కుమారి స్వాగత ప్రసంగంతో ప్రారంభమైనాయి. రీడ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డీన్ & సెక్రటరీ డా. ఎస్. పి. రవీంద్ర వర్క్‌షాప్ యొక్క లక్ష్యాలను వివరిస్తూ “సంస్థలు నిరంతరం మారుతున్న కాలంలో డైనమిక్
వాతావరణంలో నాయకత్వ నైపుణ్యాలను అలవరచుకోవాలని అది అత్యవసరమని అభిప్రాయపడ్డారు.
డిఫెన్స్ ప్రోగ్రామ్స్ అకడెమిక్ అడ్వైజర్ డా. ఉజ్జ్వల్ కుమార్ ఘట్టక్ రక్షణ సిబ్బందిలో నిరంతర ప్రొఫెషనల్ లెర్నింగ్ నాయకత్వ సామర్థ్యాల ప్రాధాన్యతను వివరించారు.
గౌరవ అతిథి ఇమ్తియాజ్ అర్షద్, సిఇఓ & సెక్రటరీ, హెచ్‌పిసిఎల్–ఎస్డిఐ,
నావల్ డాక్‌యార్డ్ టెక్నికల్ లీడర్లకు నైపుణ్యాభివృద్ధి అవకాశాలను కల్పించే ఈ సంయుక్త ప్రయత్నాన్ని అభినందిందిస్తూ “ప్రతి ఉద్యోగి ఒక చిన్నారి వలె ఆసక్తిగా నేర్చుకోవడం ద్వారానే మనం అభివృద్ధి చెందుతామని తద్వారా పనివాతావరణానికి తగిన మార్పును తెచ్చుకోగలమన్నారు. నాయకత్వం,నిర్వహణ మధ్య తేడాను వివరించుతూ, “ప్రతి నాయకుడు మేనేజర్ కావచ్చు కానీ ప్రతి మేనేజర్ నాయకుడు కాలేడు” అని పేర్కొన్నారు. ఆయన చేర్చినదేమిటంటే, “ఇలాంటి శిక్షణా కార్యక్రమాల ద్వారా మాత్రమే మేనేజీరియల్ నైపుణ్యాలను పద్ధతిగా పెంపొందించుకోవచ్చు” అని అన్నారు.
విశిష్ట అతిథి కమాండర్ అదేష్ పల్ సింగ్, డైరెక్టర్ (అడ్మిన్), రక్షణ రంగంలో మారుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అప్‌స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. క్రమశిక్షణతో పనిచేసే కార్మికులు, ఫోర్‌మెన్లు చేసే బ్యాక్‌గ్రౌండ్ పనుల ప్రాముఖ్యతను వివరించారు.
నావల్ డాక్‌యార్డ్ కార్యకలాపాల సమర్థతకు వారు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆయన అన్నారు.
రీడ్ గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ డైరెక్టర్ జనరల్ ఆంధ్ర విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్ ప్రొ. వి. కృష్ణ మోహన్, ఈ పదిరోజుల శిక్షణ కార్యక్రమం గురించి వివరించారు. ఈ కార్యక్రమం మేనేజీరియల్ ఎఫెక్టివ్‌నెస్, కమ్యూనికేషన్, ప్రాబ్లం సాల్వింగ్ నైపుణ్యాలను పెంపొందించడానికి రూపొందించబడిందని చెప్పారు. ప్రతి సెషన్ యొక్క లక్ష్యాలను, అందజేయబోయే శిక్షణా మెటీరియల్‌ను వివరించారు.
ముఖ్య అతిథి ప్రొ. ఎం. ముత్యాల నాయుడు, మాజీ వైస్ ఛాన్సలర్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం వర్క్‌షాప్‌ను ప్రారంభించి, పాల్గొనేవారిని సక్రియమైన అభ్యాస దృక్పథాన్ని అవలంబించమని ప్రోత్సహించారు. డైనమిక్ ప్రొఫెషనల్ వాతావరణంలో తాము సకాలంలో ఉండటానికి ఇది అవసరమని పేర్కొన్నారు. ఆయన ముఖ్యంగా ఫోర్‌మన్/చార్జ్‌మన్‌ల వంటి ఫస్ట్ లైన్ మేనేజర్‌లకు నాయకత్వ నైపుణ్యాల ప్రాముఖ్యతను వివరించారు.
కార్యక్రమంలో,ఐఐఏఎం ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ డా. ఉమా సుందరి ద్విభాష్యం ధన్యవాదములు తెలిపి గౌరవ అతిథులను సత్కరించారు.
10 రోజులపాటు కొనసాగే శిక్షణా శిబిరంలో నావల్ డాక్‌యార్డ్ టెక్నికల్, సూపర్వైజరీ సిబ్బందికి నాయకత్వ నైపుణ్యాలను, మేనేజీరియల్ ఎఫెక్టివ్‌నెస్, అనుకూలతా నైపుణ్యాలను అభివృద్ధికి దోహద మోతాయన్నారు.


