*ఏ యూ లో విద్యార్థులు విలవిల : కాంగ్రెస్*
*విశాఖపట్నం డిసెంబర్ 4పున్నమి ప్రతినిధి:- *
కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అధ్యక్షతన ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి సునీల్ అహిరా ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పలు చోట్ల పర్యటించారు. యూనివర్సిటీలో ఉన్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రీడింగ్ రూమ్ లో విద్యార్థులతో ఆయన మాట్లాడారు, విద్యార్థుల తమ గోడును ఆయనతో విన్నవించున్నారు, రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయట్లేదని, ఏళ్ల తరబడి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తునామని మా వయసు అయిపోతే మేము అర్హత కోల్పోతామని మా కలలు కలలుగానే మిగిలిపోతాయని, మా తల్లిదండ్రులు కూలి పనులు చేసుకొని మమల్ని చదివిస్తున్నారని, మాకు ఉద్యోగాలు రాకపోతే వారికి గుండే కోత మిగిలిపోతుందని ఆవేదన వ్యక్తం చేసారు, మా సమస్యల పై పోరాడమని వారు విజ్ఞప్తి చేసారు. యూనివర్సిటీలో సదుపాయాలుతో క్లినిక్ లేకపోవడం, ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం యూనివర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక విద్యార్థి మరణం జరిగిందని పలువురు విద్యార్థులు చెప్పారు, దేశంలో అన్ని విశ్వవిద్యాలయాలలో విద్యార్థి సంఘం ఎన్నికలు జరుగుతున్న మన రాష్ట్రంలో ఆంక్షలు విధించడం దుర్మార్గమని, విద్యార్థి సంఘం నాయకులు ఉంటే యూనివర్సిటీలో సమస్యల పై పలువురు విద్యార్థులు తెలిపారు.
కార్యక్రమంలో పీసీసీ ఉపాధ్యక్షులు వేగి వెంకటేష్, పీసీసీ ప్రధాన కార్యదర్శులు మార్టిన్ లూథెర్, అమర్ జహన్ భైగ్, పీసీసీ స్పోర్ట్స్ సెల్ చైర్మన్ కమలాకర్, డీసీసీ కోఆర్డినేటర్ ఎల్ ఎన్ హాసిని వర్మ, జిల్లా మైనారిటీ సెల్ చైర్మన్ మొహమ్మద్ ఆలీ, సీనియర్ నాయకులు చిన్నబాబు, డా విజయ్ చంద్రా, దక్షిణ నియోజకవర్గ ఇంచార్జ్ కే వి సూర్యనారాయణ, జిల్లా ప్రధాన కార్యదర్శి గౌతమ్, సీనియర్ నాయకులు ఉమ్మిడి భాస్కర్, కాకినాడ చిన్నబాబు,అప్పారావు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


