ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కిన గ్రామ పరిపాలనధికారి.
పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్
కొత్తగూడెం, 27-10-2025, సోమవారం
ఏసీబి డిఎస్పీ వై. రమేష్ ఆధ్వర్యం లో ములకలపల్లి లో గ్రామ పరిపాలనధికారి లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. గ్రామ పరిపాలనాదికారి
బానోత్ శ్రీనివాస్ నాయక్ పూసుగూడెం వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కు సంబందించి రైతు నుండి 60 వేలు లంచం డిమాండ్ చేసాడు, 40 వేలు ముందు తీసుకున్నాడు. మిగతా బాలన్స్ 20 వేలు లంచం తీసుకుంటు ములకలపల్లి తహసీల్దార్ కార్యాలయం లో ఏసీబీ కి చిక్కాడు. లంచాలు తీసుకునే ఇలాంటి అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు.


