Monday, 30 March 2026
  • Home  
  • ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న
- విశాఖపట్నం

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న – రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు *విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- * ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌ పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పంచుకుంటారు. కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారం వారి తల్లిదండ్రులకు సత్కారం చేయడం జరుగుతుందని తెలిపారు. స‌మావేశం అనంత‌రం పూర్వ విద్యార్థుల సంఘంచే నిర్మింపబడిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య హాస్టక్ బ్లాక్‌ను ఆసక్తి గల సభ్యులు సందర్శిస్తారు. ఈ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని రూ 4.5 కోట్ల వ్య‌యంతో పూర్వ‌విద్యార్థుల సంఘం స‌భ్యులు స్వ‌యంగా నిర్మించి వ‌ర్సిటీకి బ‌హూక‌రించ‌డం జ‌రిగింది. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న పూర్వ‌విద్యార్థులంతా అందించిన విరాళాల‌తో ఈ హాస్ట‌ల్ భ‌వ‌న స‌ముదాయం నిర్మాణం జ‌రిపాము. విశాఖ న‌గ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఉన్న పూర్వ‌విద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జ‌రిగే పూర్వ విద్యార్థుల స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని పూర్వ‌విద్యార్థుల సంఘం త‌ర‌పున సాద‌రంగా ఆహ్వానిస్తున్నాము. శ‌తాబ్ధి వేడుక‌లు జ‌రుపుకుంటున్న త‌రుణంగా ఈ స‌మావేశం ఒక మ‌ధుర అనుభూతిగా నిల‌వాల‌ని ఆకాంక్షిస్తున్నాము. కార్య‌క్ర‌మంలో సంఘం కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్క‌ర రావు, ఉపాధ్య‌క్షులు ఎం.జి మాధ‌వ బాబు, సీనియ‌ర్ స‌భ్యులు వి.ఆర్ రావు, ర‌విశంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఏయూ సిఈ పూర్వ‌విద్యార్థుల స‌మావేశం 7న

– రూ 4.5 కోట్ల‌తో హాస్ట‌ల్ నిర్మించి అందించిన పూర్వ విద్యార్థులు
*విశాఖపట్నం డిసెంబర్ 5 పున్నమి ప్రతినిధి:- *

ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌ పూర్వ విద్యార్థుల సంఘం తమ 11వ వార్షిక సర్వసభ్య సమావేశాన్ని డిశంబరు 7 వ తేదీన డా॥ వై.వి.ఎస్.మూర్తి ఆడిటోరియంలో ఉదయం గం. 9.00 ని॥ లకు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అద్య‌క్షులు ఐ.వి.ఎన్‌.ఎస్‌.కె విశ్వ‌నాథ రావు తెలిపారు. శుక్ర‌వారం సాయంత్రం సంఘం కార్యాల‌యంలో వివ‌రాలు వెల్ల‌డించారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండ‌లి చైర్మన్ ఆచార్య కె.మధుమూర్తి విశిష్ఠ అతిధి గా, ఆంధ్ర విశ్వవిద్యాలయ ఉప‌కుల‌ప‌తి ఆచార్య జి.పి రాజశేఖర్ గౌరవ అతిథిగా హాజ‌ర‌వుతారు. ఈ కళాశాల లో మొట్టమొదటి బ్యాచ్ 1959 వ సంవత్సరం విద్యార్థులు మెదలుకొని నూతనంగా ప‌ట్ట‌భ‌ద్రులైన‌ పూర్వ విద్యార్థులు పెద్ద‌సంఖ్య‌లో ఈ స‌మావేశానికి హాజ‌రు కానున్నారు. ఇంజినీరింగ్ కళాశాల బోధనా సిబ్బంది కూడా అధిక సంఖ్య లో పాల్గొంటారు. పూర్వ‌విద్యార్థులు త‌మ ప్ర‌యాణాన్ని, ప్ర‌గ‌తిని, అనుభ‌వాల‌ను, అనుభూతుల‌ను ఈ సంద‌స్భంగా పంచుకుంటారు.
కార్యక్రమంలో భాగంగా ప్రతిభ కనబరిచిన పలువురు విద్యార్థులకు నగదు పురస్కారం వారి తల్లిదండ్రులకు సత్కారం చేయడం జరుగుతుందని తెలిపారు.

స‌మావేశం అనంత‌రం పూర్వ విద్యార్థుల సంఘంచే నిర్మింపబడిన సర్ ఎం.విశ్వేశ్వరయ్య హాస్టక్ బ్లాక్‌ను ఆసక్తి గల సభ్యులు సందర్శిస్తారు. ఈ హాస్ట‌ల్ భ‌వ‌నాన్ని రూ 4.5 కోట్ల వ్య‌యంతో పూర్వ‌విద్యార్థుల సంఘం స‌భ్యులు స్వ‌యంగా నిర్మించి వ‌ర్సిటీకి బ‌హూక‌రించ‌డం జ‌రిగింది. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల‌లో చ‌దువుకున్న పూర్వ‌విద్యార్థులంతా అందించిన విరాళాల‌తో ఈ హాస్ట‌ల్ భ‌వ‌న స‌ముదాయం నిర్మాణం జ‌రిపాము.

విశాఖ న‌గ‌రం ప‌రిస‌ర ప్రాంతాల‌లో ఉన్న పూర్వ‌విద్యార్థులంతా ఈ నెల 7వ తేదీ ఆదివారం జ‌రిగే పూర్వ విద్యార్థుల స‌మావేశానికి హాజ‌రు కావాల‌ని పూర్వ‌విద్యార్థుల సంఘం త‌ర‌పున సాద‌రంగా ఆహ్వానిస్తున్నాము. శ‌తాబ్ధి వేడుక‌లు జ‌రుపుకుంటున్న త‌రుణంగా ఈ స‌మావేశం ఒక మ‌ధుర అనుభూతిగా నిల‌వాల‌ని ఆకాంక్షిస్తున్నాము.
కార్య‌క్ర‌మంలో సంఘం కార్య‌ద‌ర్శి ఆచార్య కె.రాంబాబు, కోశాధికారి బి.భాస్క‌ర రావు, ఉపాధ్య‌క్షులు ఎం.జి మాధ‌వ బాబు, సీనియ‌ర్ స‌భ్యులు వి.ఆర్ రావు, ర‌విశంక‌ర్‌ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.