Wednesday, 25 March 2026
  • Home  
  • ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం*
- విశాఖపట్నం

ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం*

*క్వాంటం కంప్యూటింగ్ రంగంలో నిపుణులను తయారు చేయాలి* – *ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి : *శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ లో నిపుణులను తయారు చేయాలని క్విన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేష్ రావు వల్లూరి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ విభాగం సమావేశ మందిరంలో ఇంర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు రోజుల వర్క్ షాప్ క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ కి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా* ఆయన మాట్లాడుతూ కొద్దికాలంలోనే క్వాంటం కంప్యూటింగ్ ఎంతగానో అభివృద్ధి సాధిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. విభిన్న శాస్త్రాలకు సంబంధించిన అంశాలకు క్వాంటం కంప్యూటర్ ఉపయుప్తంగా నిలుస్తుందని చెప్పారు. దీని ప్రాముఖ్యతను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందడుగు వేసి వర్క్ షాప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటివి నిర్వహించడం మంచి పరిణామం అని చెప్పారు. *ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ లక్ష్యాలతో నిపుణులను ఈ రంగంలో తీర్చిదిద్దే విధంగా విభిన్న కార్యక్రమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపడుతోందని* చెప్పారు. ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటం కంప్యూటింగ్ పై ప్రత్యేక ఇంజనీరింగ్ కోర్సును సైతం ప్రారంభించామని అన్నారు. పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ రంగంలో ప్రాజెక్టులు చేయాలని సూచించారు. వీక్లీ వర్కింగ్ గ్రూప్ ని తయారుచేసుకొని ప్రతి వారం ఒక నిర్దిష్టమైన అంశంపై ప్రసంగించడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. తద్వారా విద్యార్థులు ఆయా అంశాలలో పూర్తిస్థాయిలో సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడం సాధ్యపడుతుందని అన్నారు. సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడం నేడు ఎంతో కీలకంగా మారుతోందని అన్నారు. భద్రత, వేగం అనే అంశాలు ఆధారంగా ప్రపంచం పయనిస్తోందని తెలిపారు. టెక్నాలజీకి మానవ మేధస్సు దోహదపడాలని సూచించారు. అప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. వర్క్ షాప్ కన్వీనర్ ఆచార్య పి. అనురాధ కామేశ్వరి మాట్లాడుతూ రూసా సహకారంతో ఈ రంగంలో విస్తృత అవగాహన కల్పిస్తూ నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఐదు రోజులపాటు వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్తమాన అంశాలను ఆధారంగా చేసుకుని విస్తృత అవగాహన, నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని తెలిపారు. డి.బి.ఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆచార్యులు పియూష్ దువా క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన విభిన్న అంశాలను వివరించారు. *కార్యక్రమంలో వర్క్ షాప్ సహా కన్వీనర్లు ఆచార్య పి.డి. ఎన్ శ్రీనివాసు, ఆచార్య జి. నానాజీరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.*

*క్వాంటం కంప్యూటింగ్ రంగంలో నిపుణులను తయారు చేయాలి*

– *ఏయూలో ఐదు రోజుల వర్క్ షాప్ ప్రారంభం*

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి :

*శరవేగంగా అభివృద్ధి సాధిస్తున్న క్వాంటం కంప్యూటింగ్ లో నిపుణులను తయారు చేయాలని క్విన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ మహేష్ రావు వల్లూరి అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాలలో భాగంగా మ్యాథమెటిక్స్ విభాగం ఆధ్వర్యంలో మ్యాథమెటిక్స్ విభాగం సమావేశ మందిరంలో ఇంర్వహించిన ఈ కార్యక్రమంలో ఐదు రోజుల వర్క్ షాప్ క్వాంటం కంప్యూటింగ్, కమ్యూనికేషన్ ప్రొటోకాల్స్ అండ్ క్రిప్టోగ్రఫీ కి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా* ఆయన మాట్లాడుతూ కొద్దికాలంలోనే క్వాంటం కంప్యూటింగ్ ఎంతగానో అభివృద్ధి సాధిస్తుందని, ప్రపంచవ్యాప్తంగా ఈ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని చెప్పారు. విభిన్న శాస్త్రాలకు సంబంధించిన అంశాలకు క్వాంటం కంప్యూటర్ ఉపయుప్తంగా నిలుస్తుందని చెప్పారు. దీని ప్రాముఖ్యతను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం ముందడుగు వేసి వర్క్ షాప్, ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రాం వంటివి నిర్వహించడం మంచి పరిణామం అని చెప్పారు.

*ఏయూ వీసీ ఆచార్య జి.పి రాజశేఖర్ మాట్లాడుతూ నేషనల్ క్వాంటం మిషన్, అమరావతి క్వాంటం వ్యాలీ లక్ష్యాలతో నిపుణులను ఈ రంగంలో తీర్చిదిద్దే విధంగా విభిన్న కార్యక్రమాలను ఆంధ్ర విశ్వవిద్యాలయం చేపడుతోందని* చెప్పారు. ఇటీవల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటం కంప్యూటింగ్ పై ప్రత్యేక ఇంజనీరింగ్ కోర్సును సైతం ప్రారంభించామని అన్నారు. పీజీ చదువుతున్న విద్యార్థులు ఈ రంగంలో ప్రాజెక్టులు
చేయాలని సూచించారు. వీక్లీ వర్కింగ్ గ్రూప్ ని తయారుచేసుకొని ప్రతి వారం ఒక నిర్దిష్టమైన అంశంపై ప్రసంగించడం అలవాటు చేసుకోవాలని చెప్పారు. తద్వారా విద్యార్థులు ఆయా అంశాలలో పూర్తిస్థాయిలో సామర్ధ్యాలను అందిపుచ్చుకోవడం సాధ్యపడుతుందని అన్నారు.

సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎం.వి.ఆర్ రాజు మాట్లాడుతూ సున్నితమైన సమాచారాన్ని భద్రపరచడం నేడు ఎంతో కీలకంగా మారుతోందని అన్నారు. భద్రత, వేగం అనే అంశాలు ఆధారంగా ప్రపంచం పయనిస్తోందని తెలిపారు. టెక్నాలజీకి మానవ మేధస్సు దోహదపడాలని సూచించారు. అప్పుడే దేశ ప్రగతి సాధ్యపడుతుందని, తద్వారా ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు.

వర్క్ షాప్ కన్వీనర్ ఆచార్య పి. అనురాధ కామేశ్వరి మాట్లాడుతూ రూసా సహకారంతో ఈ రంగంలో విస్తృత అవగాహన కల్పిస్తూ నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఐదు రోజులపాటు వర్క్ షాప్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వర్తమాన అంశాలను ఆధారంగా చేసుకుని విస్తృత అవగాహన, నైపుణ్యాలను పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేశామని తెలిపారు. డి.బి.ఎస్ గ్లోబల్ యూనివర్సిటీ ఆచార్యులు పియూష్ దువా క్వాంటం కంప్యూటింగ్ కి సంబంధించిన విభిన్న అంశాలను వివరించారు.

*కార్యక్రమంలో వర్క్ షాప్ సహా కన్వీనర్లు ఆచార్య పి.డి. ఎన్ శ్రీనివాసు, ఆచార్య జి. నానాజీరావు తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా అతిథులను సత్కరించి జ్ఞాపికలు బహుకరించారు.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.