శ్రీకాళహస్తి, మార్చి 24 (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. సీఎం నారా చంద్రబాబు నాయుడు మార్గదర్శకత్వంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న వేగవంతమైన నిర్ణయాలు పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా. యం. ఉమేష్ రావు పేర్కొన్నారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆర్సెలార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా ప్లాంట్‌కు భూమిపూజ జరగడం రాష్ట్రానికి శుభపరిణామమని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్ర పారిశ్రామిక వృద్ధికి కొత్త దిశ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. సుమారు రూ.1.5 లక్షల కోట్ల పెట్టుబడితో నిర్మించనున్న ఈ గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్ష మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు. ఏడాదికి 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు ఉత్పత్తి సామర్థ్యంతో ఇది దేశంలో ప్రముఖ ప్రాజెక్ట్‌గా నిలవనుందని చెప్పారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ను రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా యువతలో నమ్మకాన్ని నారా లోకేష్ నిలబెట్టారని కొనియాడారు. కేవలం ఉద్యోగాలు మాత్రమే కాకుండా, యువతకు స్థిరమైన కెరీర్, భవిష్యత్తును అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్ట్ స్థాపనకు భూములు ఇచ్చిన రైతులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇది కేవలం ఉక్కు పరిశ్రమ కాకుండా భవిష్యత్తులో “స్టీల్ సిటీ”గా అభివృద్ధి చెందే కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డా.జి.దశరథాచారి,వన్నెకుల క్షత్రియ సంక్షేమం, అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి,గిరిజన సలహా మండలి సభ్యులు యం.సుబ్బయ్య, బిసి విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డా.యం.ఉమేష్ రావు,తంగేళ్ళ పాలెం పిఏసియస్ ఛైర్మన్ బీమాల భాస్కర్ ముదిరాజ్, శ్రీకాళహస్తి పట్టణ కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రం కిషోర్, నాయీ బ్రాహ్మణ సాధికార సమితి తిరుపతి పార్లమెంటు సోషల్ మీడియా కన్వీనర్ కోట చంద్రశేఖర్,తిరుపతి పార్లమెంటు నాయకుడు గంగనపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఏపీలో భారీ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం – లక్ష ఉద్యోగాలకు దారి, లోకేష్ కార్యదక్షతకు ప్రశంసలు