ఏపీలో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు

0
147

తేదీ: 19.05.2020 పున్నమి తెలుగు దిన పత్రిక ✍️
ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 57 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. కొత్తగా కర్నూలు, చిత్తూరు జిల్లాలో వైరస్ వల్ల ఒక్కొక్కరు మరణించడంతో మృతుల సంఖ్య 52 కి చేరింది. ఇటు రాష్ట్రంలో మొత్తం కేసులు సంఖ్య 2,339 కి చేరుకుంది. ప్రస్తుతం 691 యాక్టీవ్ కేసులు ఉండగా 1,596 మంది డిశ్చార్జ్ అయ్యారు.