Sunday, 7 December 2025
  • Home  
  • ఏపీలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు శుభవార్త, వాహన మిత్ర రూ.15000 సాయం కోసం eKYC ప్రారంభం
- ఆంధ్రప్రదేశ్

ఏపీలో ఆటో, టాక్సీ డ్రైవర్లకు శుభవార్త, వాహన మిత్ర రూ.15000 సాయం కోసం eKYC ప్రారంభం

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం ₹15,000 ఆర్థిక సహాయం నేరుగా డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై ప్రభావం పడింది. ఈ దసరా నుంచి ప్రభుత్వం వాహన మిత్ర అమలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈసారి కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదు చేయబడిన లబ్ధిదారులకు eKYC వెరిఫికేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిపుచ్చుకోవచ్చు. గ్రామ లేదా వార్డు సచివాలయంలో eKYC వెరిఫికేషన్ పూర్తి చేస్తే, ఈ సాయం నిర్ధారితంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ప్రస్తుతం, లబ్ధిదారుల జాబితా GSWS యాప్ లో అందుబాటులో ఉంది. సచివాలయ సిబ్బంది OTP, బయోమెట్రిక్ లేదా Face Authentication ద్వారా eKYC పూర్తి చేస్తారు. eKYC కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) డ్రైవింగ్ లైసెన్స్ వాహన ఇన్సూరెన్స్ కాపీ బ్యాంక్ పాస్‌బుక్ రేషన్ కార్డు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే, వారి కుటుంబ సభ్యులు ఈ పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తి చేయవచ్చు. సమస్యలు, పరిష్కారం eKYC ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఏర్పడితే, Logout చేసి మళ్లీ Login కావాల్సి ఉంటుంది. OTP రాకపోతే, ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయిందో చెక్ చేసుకోవాలి. అలాగే, పేర్లలో తేడాలు ఉన్నప్పుడు అదనపు గుర్తింపు పత్రాలు సమర్పించాలి. స్టేటస్ చెక్ చేయడం ఈ పథకం యొక్క స్టేటస్‌ను గ్రామ/వార్డు సచివాలయం లేదా GSWS యాప్ ద్వారా చెక్ చేయవచ్చు. వారు మాత్రమే అర్హులు వాహన మిత్ర పథకం కింద సొంత వాహనం కలిగి, స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులు. అంటే, అర్హతను పొందడానికి, వ్యక్తి ఆ వాహనాన్ని స్వయంగా నడపాలి. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు (ఆటోలు లేదా క్యాబ్‌లు) ఉన్నా, కేవలం ఒక వాహనానికి మాత్రమే వర్తిస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్ వాహనాలు కలిగినప్పుడు, ఈ ఆర్థిక సహాయం ఒక వాహనానికి మాత్రమే లభిస్తుంది. eKYC కోసం ఆధార్ కార్డు, వాహనం RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలు అవసరం. లబ్ధిదారు అందుబాటులో లేకపోయినా కుటుంబ సభ్యులు పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తిచేయవచ్చు

సెప్టెంబర్ 18 పున్నమి ప్రతినిధి @
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆటో, టాక్సీ, మాక్సీ క్యాబ్ డ్రైవర్లకు వాహన మిత్ర పథకం ద్వారా శుభవార్త అందించింది. ఈ పథకం ద్వారా ప్రతీ సంవత్సరం ₹15,000 ఆర్థిక సహాయం నేరుగా డ్రైవర్ల బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం అమలు చేసిన తర్వాత ఆటో డ్రైవర్లపై ప్రభావం పడింది. ఈ దసరా నుంచి ప్రభుత్వం వాహన మిత్ర అమలు ప్రారంభించాలని నిర్ణయించింది.

ఈసారి కొత్త దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే నమోదు చేయబడిన లబ్ధిదారులకు eKYC వెరిఫికేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందిపుచ్చుకోవచ్చు. గ్రామ లేదా వార్డు సచివాలయంలో eKYC వెరిఫికేషన్ పూర్తి చేస్తే, ఈ సాయం నిర్ధారితంగా బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది.

ప్రస్తుతం, లబ్ధిదారుల జాబితా GSWS యాప్ లో అందుబాటులో ఉంది. సచివాలయ సిబ్బంది OTP, బయోమెట్రిక్ లేదా Face Authentication ద్వారా eKYC పూర్తి చేస్తారు.

eKYC కోసం అవసరమైన పత్రాలు ఆధార్ కార్డు
వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) డ్రైవింగ్ లైసెన్స్
వాహన ఇన్సూరెన్స్ కాపీ
బ్యాంక్ పాస్‌బుక్
రేషన్ కార్డు లబ్ధిదారులు అందుబాటులో లేకపోతే, వారి కుటుంబ సభ్యులు ఈ పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తి చేయవచ్చు.

సమస్యలు, పరిష్కారం
eKYC ప్రక్రియలో ఏవైనా సమస్యలు ఏర్పడితే, Logout చేసి మళ్లీ Login కావాల్సి ఉంటుంది. OTP రాకపోతే, ఆధార్ మొబైల్ నంబర్ లింక్ అయిందో చెక్ చేసుకోవాలి. అలాగే, పేర్లలో తేడాలు ఉన్నప్పుడు అదనపు గుర్తింపు పత్రాలు సమర్పించాలి.

స్టేటస్ చెక్ చేయడం
ఈ పథకం యొక్క స్టేటస్‌ను గ్రామ/వార్డు సచివాలయం లేదా GSWS యాప్ ద్వారా చెక్ చేయవచ్చు.

వారు మాత్రమే అర్హులు
వాహన మిత్ర పథకం కింద సొంత వాహనం కలిగి, స్వయంగా డ్రైవింగ్ చేస్తున్న వారు మాత్రమే అర్హులు. అంటే, అర్హతను పొందడానికి, వ్యక్తి ఆ వాహనాన్ని స్వయంగా నడపాలి. ఒకటి కంటే ఎక్కువ వాహనాలు (ఆటోలు లేదా క్యాబ్‌లు) ఉన్నా, కేవలం ఒక వాహనానికి మాత్రమే వర్తిస్తుంది. వాహన యజమాని లేదా డ్రైవర్ వాహనాలు కలిగినప్పుడు, ఈ ఆర్థిక సహాయం ఒక వాహనానికి మాత్రమే లభిస్తుంది.

eKYC కోసం ఆధార్ కార్డు, వాహనం RC, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ కాపీ, రేషన్ కార్డు, బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలు అవసరం. లబ్ధిదారు అందుబాటులో లేకపోయినా కుటుంబ సభ్యులు పత్రాలతో వెళ్లి OTP ద్వారా eKYC పూర్తిచేయవచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.