
నెల్లూరు ఎంపీ ఆదాలకు వైసీపీ నేతల వినతి నెల్లూరులో 7 సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ను నిలుపుదల చేసేందుకు ప్రయత్నించాలని ముగ్గురు వైసీపీ నేతలు నెల్లూరు ఎంపీ ఆదాలకు ఒక వినతి పత్రాన్ని బుధవారం సాయంత్రం సమర్పించారు ఈ రైళ్లను నిలపడం వల్ల నెల్లూరు ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని విజ్ఞప్తి చేశారు గరీబ్ రథ్, కోరమండల్ ,హౌరా -మైసూర్, బిలాస్పూర్ నెల్లూరులో నిలిపేందుకు కృషిచేయాలని కోరారు న్యాయవాది గూడూరు సుబ్బారెడ్డి, ముదిగొండ మాధవ్, పాముల హరి ఈ మేరకు ఆయనకు విజ్ఞప్తి చేశారు .దీనిపై స్పందించిన నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి తన వంతు ప్రయత్నం తప్పకుండా చేస్తానని వారికి హామీ ఇచ్చారు. Also read

