(అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 12 పున్నమి న్యూస్, ప్రతినిధి ఆనంద్ ):
అనకాపల్లి జిల్లాలోని ఏటికొప్పాక గ్రామ సచివాలయంలో ఆదివారం సన్‌షైన్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరంలో డా. ఆర్. గంగాధర్ (MBBS), డా. ఆర్. లక్ష్మి ప్రీతి (MBBS) సహా అనుభవజ్ఞులైన వైద్యులు గ్రామ ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు ఉచితంగా అందించారు. ముఖ్యంగా ఎముకల సమస్యలు, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, చిన్నపిల్లల వైద్యం, సాధారణ రోగాల చికిత్స వంటి సేవలు అందించారు. వైద్యులు మాట్లాడుతూ ప్రజలు తమ ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలని, అందుబాటులో ఉన్న వైద్య సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మీ రాము, కాండ్రకోట చిరంజీవి, అన్నం బాబూజీ, నగిరెడ్డి అచ్చయనాయుడు, రాయి చలపతి, సరోజిరావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను, బత్తుల వెంకటరమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కూటమి నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా జరిగింది.





