అనకాపల్లి జిల్లా జనవరి 29 పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్ :
ఏటికొప్పాక గ్రామంలో ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 16 నుండి 31 వరకు ఉచిత పశు వైద్య శిబిరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. గ్రామీణ పశు వైద్య సేవల కొరకు నిర్వహించిన ఈ శిబిరంలో రోగ పశువులకు తక్షణ వైద్యం అందించడం ప్రధానంగా నిర్వహించబడింది.
ఎ. డి డా CH. గంగాధర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన పశువులు రైతులకు అధిక పాల ఉత్పత్తి మరియు స్థిరమైన ఆదాయం ఇస్తాయని తెలిపారు. ఈ సందర్భంగా గర్భకోష వ్యాధితో బాధపడుతున్న పశువులకు చికిత్సలు, దూడలకు నట్టల నివారణ మందులు రైతులకు పంపిణీ చేయబడ్డాయి.
ఈ శిబిరంలో Dr. L. కన్నయ్య నాయుడు, వెటర్నరీ అసిస్టెంట్స్ సిబ్బంది, ఏటికొప్పాక గ్రామ సర్పంచ్ బజంత్రీల లక్ష్మీ, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, గొంతు మూర్తి కొండయ్య నాయుడు, అన్నం సరోజిరావు వంటి కూటమి నాయకులు, అలాగే గ్రామీణ రైతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమం పశువుల ఆరోగ్య పరిరక్షణ, రైతుల సంక్షేమం మరియు గ్రామీణ పాలు ఉత్పత్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తోంది.



