అనకాపల్లి జిల్లా ఏప్రిల్ 11 పున్నమి న్యూస్ (ప్రతినిధి ఆనంద్): ఏటికొప్పాక గ్రామంలో శనివారం 104 వైద్య కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. గ్రామంలోని వృద్ధులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించి తగిన మందులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యులు, ANM సిబ్బంది, ఆశా వర్కర్స్ పాల్గొని రోగులను సమగ్రంగా పరిశీలించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరోగ్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. అలాగే వైద్యుల సూచనల మేరకు మందులు క్రమంగా తీసుకోవాలని అవగాహన కల్పించారు. పేషెంట్లు అధిక సంఖ్యలో హాజరై సేవలు పొందారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలు అందించడంలో ఈ శిబిరం కీలకంగా నిలిచింది. ప్రజలు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.




