Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
Anakapalli

ఏటికొప్పాకలో రేపు కనకదుర్గమ్మ మహోత్సవం

Punnami Newsroom Published:
ఏటికొప్పాకలో రేపు కనకదుర్గమ్మ మహోత్సవం

Story highlights

  • ఏటికొప్పాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహోత్సవాన్ని మంగళవారం (అక్టోబర్ 20) వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
  • ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారి నిమజ్జన ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు.ఉదయం 5 గంటల నుంచి డైలీ మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయం సమీపంలో వాహన పూజలు నిర్వహించనున్నారు.
  • మధ్యాహ్నం 2 గంటలకు జమ్మి పూజ జరగనుంది.

ఏటికొప్పాక గ్రామంలో శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి మహోత్సవాన్ని మంగళవారం (అక్టోబర్ 20) వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా వివిధ పూజా కార్యక్రమాలతో పాటు అమ్మవారి నిమజ్జన ఊరేగింపును ఘనంగా నిర్వహించనున్నారు.ఉదయం 5 గంటల నుంచి డైలీ మార్కెట్ వద్ద ఉన్న అమ్మవారి ఆలయం సమీపంలో వాహన పూజలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జమ్మి పూజ జరగనుంది. సాయంత్రం 6 గంటలకు అమ్మవారి నిమజ్జన ఊరేగింపు ప్రారంభం కానుంది.ఈ ఊరేగింపులో ఉమా ఆర్కెస్ట్రా, అన్నవరం వారి కోలాటం, తప్పెటగుళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. భారీ మందుగుండు సామగ్రి ప్రదర్శనతో ఊరేగింపును వైభవంగా నిర్వహించేందుకు మహాత్మా యూత్ కమిటీ ఏర్పాట్లు చేసింది.
గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని, మహోత్సవాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *