Thursday, 19 February 2026
  • Home  
  • ఏటికొప్పాకలో రాజకీయ శక్తి ప్రదర్శన… ఉచిత గుండె శిబిరంతో ప్రజల్లో నమ్మకం పెంచుకున్న తెలుగుదేశం పార్టీ…!
- అనకాపల్లి

ఏటికొప్పాకలో రాజకీయ శక్తి ప్రదర్శన… ఉచిత గుండె శిబిరంతో ప్రజల్లో నమ్మకం పెంచుకున్న తెలుగుదేశం పార్టీ…!

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 19 పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో, స్వరా హాస్పటల్ సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. అనుభవజ్ఞులైన హృదయ వైద్యులు గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ECG, ECHO వంటి ఖరీదైన స్కానింగ్ పరీక్షలను ఉచితంగా చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, ఊడి రామకృష్ణ, భజంత్రీల శ్రీను తదితర కూటమి సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఇలాంటి శిబిరాలు మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

అనకాపల్లి జిల్లా ఫిబ్రవరి 19 పున్నమి న్యూస్ ప్రతినిధి ( ఆనంద్ ) : ఏటికొప్పాక గ్రామంలో ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో, స్వరా హాస్పటల్ సౌజన్యంతో గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉచిత గుండె వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు హాజరై వైద్య సేవలు పొందారు. అనుభవజ్ఞులైన హృదయ వైద్యులు గుండె సంబంధిత సమస్యలపై ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు. ECG, ECHO వంటి ఖరీదైన స్కానింగ్ పరీక్షలను ఉచితంగా చేసి, అవసరమైన వారికి మందులు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ భజంత్రీల లక్ష్మి, మాజీ సర్పంచ్ కాంట్రకోట చిరంజీవి, అన్నం బాబ్జి, నగిరెడ్డి అచ్చయ్య నాయుడు, అన్నం స్వరజీరావు, ఊడి రామకృష్ణ, భజంత్రీల శ్రీను తదితర కూటమి సీనియర్ నాయకులు మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు. ప్రజల ఆరోగ్యంపై ఇలాంటి శిబిరాలు మరింతగా నిర్వహించాలని గ్రామస్థులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.