అనకాపల్లి జిల్లా మార్చి 31(పున్నమి న్యూస్ ప్రతినిధి – ఆనంద్):
ఏటికొప్పక షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కార్మికుల జీతాలు, గ్రాట్యుటీ, పీఎఫ్ సమస్యల పరిష్కారం కోరుతూ జనసేన పార్టీ కార్యాలయంలో వినతి పత్రాలు అందజేశారు. డైలీ వేజ్ కార్మికులకు కూడా శాశ్వత ఉద్యోగుల మాదిరిగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డైరెక్టర్ తో ఫోన్‌లో మాట్లాడగా, ప్రభుత్వం వద్దకు వివరాలు పంపినట్లు తెలిపారు. ఇదే వినతిని టీడీపీ కార్యాలయంలో కూడా సమర్పించారు. కార్యక్రమంలో యూనియన్ అధ్యక్షుడు నాగిరెడ్డి అప్పారావు, కార్యదర్శి దారా పోలిశెట్టి, కోశాధికారి కాండ్రకోట సత్యనారాయణ పాల్గొన్నారు.



