Tuesday, 9 December 2025
  • Home  
  • ఏఐటీయూసీ105 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు ఘనంగా నిర్వహించండి
- తెలంగాణ

ఏఐటీయూసీ105 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు ఘనంగా నిర్వహించండి

పున్నమి అక్టోబర్ 30 తెలంగాణ: రామగుండం: సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు కార్మికులకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ ల పిలుపు భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలకు ప్రతినిథ్యం వహిస్తూ ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించబడింది. స్వతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయ్,బాల గంగాధర్ తిలక్,జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి వి గిరి తో పాటు ఆనాటి కమ్యూనిస్టు కార్మిక సంఘాల నాయకులైన ఎస్ ఏ డాంగే, ఇంద్రజిత్ గుప్తా,పార్వతి కృష్ణన్, ఏబీ బర్ధన్,మగ్దూం మొయినుద్దీన్, రాజ్ బహుదూర్ గౌర్,కే ఎల్ మహేంద్ర లాంటి పోరాట యోధులు ఏఐటీయూసీ కి నాయకత్వం వహించారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని నినదించిన మొట్టమొదటి సారిగా తీర్మానించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ. స్వతంత్రానికి ముందు తరువాత కార్మిక హక్కుల కొరకు పోరాడి ట్రేడ్ యూనియన్ చట్టం పారిశ్రామిక సంబంధాల ప్రమాదాల పరిహారాల చట్టం, కనీస వేతన చట్టం,బోనస్ గ్రాట్యుటీ – ఈఎస్ఐ,పి ఎఫ్, బీడీ కార్మికుల చట్టం, భవన నిర్మాణ కార్మికుల చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి 44 కార్మిక చట్టాలను ఏఐటీయూసీ పోరాడి సాధించింది. రామగుండం నియోజకవర్గంలోని అసంఘటిత రంగాలైన మునిసిపల్, ఆర్ టి సి, ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్, మెడికల్, సింగరేణి,భసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ,తెలంగాణ పవర్ ప్రాజెక్ట్, శానిటరీ కార్మికులు,మధ్యాహ్న భోజన కార్మికులు,అంగన్ వాడి, ఆశ,ఏ ఎన్ ఎం ఇతర కార్మికులకు హమాలీలకు,భవన నిర్మాణ కార్మికులకు,ఉపాధి హామీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కనీస కార్మిక చట్టాలైన పిఎఫ్,ఈఎస్ ఐ, గ్రాట్యుటీ,సమాన పనికి సమాన- వేతనం,పనికి తగిన ప్రతిపలం లేని తీవ్రమైన పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు ఆటుపోట్లు కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పెద్ద నోట్ల రద్దు చేసి స్వీస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన,ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం,రైతుకు ఆదాయ రెట్టింపు లాంటి బూటక వాగ్దానాలు మోసపూరిత మని తేలిపోయాయి. పూర్తిగా అన్ని రంగాలలో ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని,అంబానీలకు వేల కోట్లు కట్టబెట్టి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుంది.100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను వీటిలో ముఖ్యమైన 29 చట్టాలను మార్పిడితో వ్యాపారం సులభతరం పేరుతో పెట్టుబడిదారులకు ఆదాని, అంబానీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను పాలకులు హరించి వేస్తున్నారు. ప్రజలపై నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వస్తువులపై విపరీతంగా ధరలు పెంచి అసంఘటిత కార్మిక రంగం నడ్డి విరుస్తుంది.ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగం బ్యాంకులు ఇన్సూరెన్స్,బొగ్గు, ఉక్కు గనులు, రైల్వే, విమానయాన, పోర్టులు పోస్ట్ ఆఫీసులు,బిఎస్ ఎన్ ఎల్, ఆయిల్ కంపెనీ లు ఓ ఎన్ జి ఎస్, బి ఏ ఈ, ఇస్రో లాంటి అనేక పరిశ్రమలను ఆదాని, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ప్రైవేట్ పరం చేయబడుతుంది. ఇది యావత్ అన్ని వర్గాల కార్మిక వర్గం గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డు సిఫారసు చేసి ఐదు జీవోలను అమలు చేయకుండా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు వంత పాడుతుంది. సుమారు 18 సంవత్సరాలుగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచబడలేదు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం చెల్లించడం లేదు.ఏఐటీయూసీ రామగుండం నియోజకవర్గంలోని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు వలస కార్మికులకు వీరితో పాటు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇస్తానన్న 12000 రూపాయలు ఇవ్వాలని ఆటో డ్రైవర్ కార్మికులకు కూడా అండగా ఉండి వారి సౌకర్యాలు ఇతర కార్మిక ఉద్యోగులకు భద్రత ఉపాధి హక్కులకై ఏఐటీయూసీ పోరాడుతుంది. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించింది. 105 వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు ఆయా పని స్థలాల్లో బస్తీలలో వారం రోజులపాటు ఆవిర్భావ దినోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఎర్ర తోరణాలతో ఎరుపుమయం చేసి ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయాలని ముఖ్యమైన నాయకులకు సీనియర్స్ ని గుర్తించి శాలువా మెమొంటోలతో సన్మానం సత్కారం చేసి ఒక పండుగ వాతావరణంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని కార్మిక వర్గానికి ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్ర శేఖర్ లు పిలుపునిచ్చారు.

పున్నమి అక్టోబర్ 30 తెలంగాణ: రామగుండం: సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు కార్మికులకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ ల పిలుపు భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలకు ప్రతినిథ్యం వహిస్తూ ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించబడింది. స్వతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయ్,బాల గంగాధర్ తిలక్,జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి వి గిరి తో పాటు ఆనాటి కమ్యూనిస్టు కార్మిక సంఘాల నాయకులైన ఎస్ ఏ డాంగే, ఇంద్రజిత్ గుప్తా,పార్వతి కృష్ణన్, ఏబీ బర్ధన్,మగ్దూం మొయినుద్దీన్, రాజ్ బహుదూర్ గౌర్,కే ఎల్ మహేంద్ర లాంటి పోరాట యోధులు ఏఐటీయూసీ కి నాయకత్వం వహించారు.
దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని నినదించిన మొట్టమొదటి సారిగా తీర్మానించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ. స్వతంత్రానికి ముందు తరువాత కార్మిక హక్కుల కొరకు పోరాడి ట్రేడ్ యూనియన్ చట్టం పారిశ్రామిక సంబంధాల ప్రమాదాల పరిహారాల చట్టం, కనీస వేతన చట్టం,బోనస్ గ్రాట్యుటీ – ఈఎస్ఐ,పి ఎఫ్, బీడీ కార్మికుల చట్టం, భవన నిర్మాణ కార్మికుల చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి 44 కార్మిక చట్టాలను ఏఐటీయూసీ పోరాడి సాధించింది. రామగుండం నియోజకవర్గంలోని అసంఘటిత రంగాలైన మునిసిపల్, ఆర్ టి సి, ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్, మెడికల్, సింగరేణి,భసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ,తెలంగాణ పవర్ ప్రాజెక్ట్, శానిటరీ కార్మికులు,మధ్యాహ్న భోజన కార్మికులు,అంగన్ వాడి, ఆశ,ఏ ఎన్ ఎం ఇతర కార్మికులకు హమాలీలకు,భవన నిర్మాణ కార్మికులకు,ఉపాధి హామీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కనీస కార్మిక చట్టాలైన పిఎఫ్,ఈఎస్ ఐ, గ్రాట్యుటీ,సమాన పనికి సమాన- వేతనం,పనికి తగిన ప్రతిపలం లేని తీవ్రమైన పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు ఆటుపోట్లు కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పెద్ద నోట్ల రద్దు చేసి స్వీస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన,ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం,రైతుకు ఆదాయ రెట్టింపు లాంటి బూటక వాగ్దానాలు మోసపూరిత మని తేలిపోయాయి. పూర్తిగా అన్ని రంగాలలో ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని,అంబానీలకు వేల కోట్లు కట్టబెట్టి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుంది.100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను వీటిలో ముఖ్యమైన 29 చట్టాలను మార్పిడితో వ్యాపారం సులభతరం పేరుతో పెట్టుబడిదారులకు ఆదాని, అంబానీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను పాలకులు హరించి వేస్తున్నారు.
ప్రజలపై నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వస్తువులపై విపరీతంగా ధరలు పెంచి అసంఘటిత కార్మిక రంగం నడ్డి విరుస్తుంది.ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగం బ్యాంకులు ఇన్సూరెన్స్,బొగ్గు, ఉక్కు గనులు, రైల్వే, విమానయాన, పోర్టులు పోస్ట్ ఆఫీసులు,బిఎస్ ఎన్ ఎల్, ఆయిల్ కంపెనీ లు ఓ ఎన్ జి ఎస్, బి ఏ ఈ, ఇస్రో లాంటి అనేక పరిశ్రమలను ఆదాని, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ప్రైవేట్ పరం చేయబడుతుంది. ఇది యావత్ అన్ని వర్గాల కార్మిక వర్గం గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డు సిఫారసు చేసి ఐదు జీవోలను అమలు చేయకుండా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు వంత పాడుతుంది. సుమారు 18 సంవత్సరాలుగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచబడలేదు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం చెల్లించడం లేదు.ఏఐటీయూసీ రామగుండం నియోజకవర్గంలోని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు వలస కార్మికులకు వీరితో పాటు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇస్తానన్న 12000 రూపాయలు ఇవ్వాలని ఆటో డ్రైవర్ కార్మికులకు కూడా అండగా ఉండి వారి సౌకర్యాలు ఇతర కార్మిక ఉద్యోగులకు భద్రత ఉపాధి హక్కులకై ఏఐటీయూసీ పోరాడుతుంది.
ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించింది. 105 వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా
రామగుండం నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు ఆయా పని స్థలాల్లో బస్తీలలో వారం రోజులపాటు ఆవిర్భావ దినోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఎర్ర తోరణాలతో ఎరుపుమయం చేసి ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయాలని ముఖ్యమైన నాయకులకు సీనియర్స్ ని గుర్తించి శాలువా మెమొంటోలతో సన్మానం సత్కారం చేసి ఒక పండుగ వాతావరణంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని కార్మిక వర్గానికి ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్ర శేఖర్ లు పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.