Sunday, 7 December 2025
  • Home  
  • ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు
- E-పేపర్

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని అక్టోబర్ 28న రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ను జయప్రదం చేయండి.అక్టోబర్ 28 రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నా కు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ రాక.ఆదివారం రైల్వే కోడూరు లో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)అధ్యక్షులు పాండురంగయ్య ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది . ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్‌లో ఉన్న క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.గత వైసిపి ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కార్మికుల కోసం ఏర్పాటైన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ 2019లో జీఓ నెం.1214 జారీ చేయడం వల్లే వేలాది క్లైమ్ లు పెండింగ్‌లోకి వెళ్లాయని వారు అన్నారు. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా 18 నెలలు గడిచినా ఈ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సెస్ రూపంలో వందల కోట్ల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్‌కి చేరుతున్నప్పటికీ, ఆ నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించకపోవడం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా పెండింగ్ క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.వైసిపి పాలనలో కార్మికులు ఎన్నో వేధింపులకు గురయ్యారని, ఎన్నికల ముందు కూటమి నాయకులు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 50 లక్షల కుటుంబాలు ఆశతో కూటమికి మద్దతు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.ఇప్పటికే వేలాది కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు పోస్టుకార్డులు రాసి వినతులు పంపారని, అలాగే కార్మికశాఖ మంత్రి, వెల్ఫేర్ బోర్డు చైర్మన్, లేబర్ కమిషనర్‌లను కూడా ప్రత్యక్షంగా కలిసి విన్నవించామని వారు తెలిపారు. అయినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో, త్వరలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు. గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక దాని వూసే లేదన్నారు. క్లైమ్లకు నిధులు మంజూరు చేస్తామని ధాంబికాలు పలికారని వారు ఏద్దావా చేశారు. కార్మికులు అక్టోబర్ 28 జరుగు ధర్నాను జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రైల్వే కోడూరు కమిటీ నాయకులు భాస్కర్ నరసింహులు హరి చిన్న. భవన నిర్మాణ సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల భవన నిర్మాణ సంక్షేమ బోర్డు

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి

భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునః ప్రారంభించాలని అక్టోబర్ 28న రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా ను జయప్రదం చేయండి.అక్టోబర్ 28 రాయచోటి కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరుగు ధర్నా కు ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ రాక.ఆదివారం రైల్వే కోడూరు లో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ)అధ్యక్షులు పాండురంగయ్య ఆధ్వర్యంలో కరపత్రాలను విడుదల చేయడం జరిగింది .
ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు మాదరాజు గంగాధర్ హాజరై మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పెండింగ్‌లో ఉన్న క్లైములకు తక్షణమే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి స్పష్టమైన ప్రకటన చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.గత వైసిపి ప్రభుత్వం కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కార్మికుల కోసం ఏర్పాటైన సంక్షేమ బోర్డును నిర్వీర్యం చేస్తూ 2019లో జీఓ నెం.1214 జారీ చేయడం వల్లే వేలాది క్లైమ్ లు పెండింగ్‌లోకి వెళ్లాయని వారు అన్నారు. అయితే అనంతరం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కూడా 18 నెలలు గడిచినా ఈ సమస్యల పరిష్కారానికి ముందడుగు వేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.సెస్ రూపంలో వందల కోట్ల రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్‌కి చేరుతున్నప్పటికీ, ఆ నిధులు కార్మికుల సంక్షేమానికి వినియోగించకపోవడం ఆందోళనకరమని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకుపైగా పెండింగ్ క్లెయిమ్లు వెంటనే క్లియర్ చేయాలని, లేనిపక్షంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాసాలను ముట్టడించాల్సి వస్తుందని వారు హెచ్చరించారు.వైసిపి పాలనలో కార్మికులు ఎన్నో వేధింపులకు గురయ్యారని, ఎన్నికల ముందు కూటమి నాయకులు కార్మిక సంక్షేమ బోర్డును పునరుద్ధరించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి, మేనిఫెస్టోలో కూడా పొందుపరిచిన విషయాన్ని వారు గుర్తు చేశారు. భవన నిర్మాణ కార్మికులు, వారి కుటుంబ సభ్యులు కలిపి 50 లక్షల కుటుంబాలు ఆశతో కూటమికి మద్దతు ఇచ్చారని, కానీ ఇప్పటివరకు హామీలు నెరవేర్చకపోవడం వల్ల తీవ్ర అసంతృప్తి నెలకొందని పేర్కొన్నారు.ఇప్పటికే వేలాది కార్మికులు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లకు పోస్టుకార్డులు రాసి వినతులు పంపారని, అలాగే కార్మికశాఖ మంత్రి, వెల్ఫేర్ బోర్డు చైర్మన్, లేబర్ కమిషనర్‌లను కూడా ప్రత్యక్షంగా కలిసి విన్నవించామని వారు తెలిపారు. అయినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో, త్వరలో భవన నిర్మాణ కార్మికులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టక తప్పదని హెచ్చరించారు.
గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే సంక్షేమ బోర్డుకు కోటి రూపాయలు కేటాయిస్తామని చెప్పారని, కానీ అధికారంలోకి వచ్చాక దాని వూసే లేదన్నారు. క్లైమ్లకు నిధులు మంజూరు చేస్తామని ధాంబికాలు పలికారని వారు ఏద్దావా చేశారు. కార్మికులు అక్టోబర్ 28 జరుగు ధర్నాను జయప్రదం చేయాలని వారు కార్మికులకు పిలుపునిచ్చారు. *ఈ సమావేశంలో ఏపీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధం రైల్వే కోడూరు కమిటీ నాయకులు భాస్కర్ నరసింహులు హరి చిన్న. భవన నిర్మాణ సంఘం నాయకులు కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.