Contact Us Latest News
True news. Fast information. Andhra Pradesh • Telangana • National
Author Panel
E-Paper

ఏఐటియూసి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

Punnami Newsroom Published:
ఏఐటియూసి జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి

Story highlights

  • ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపు ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల 26న ఆసిఫాబాద్‌లోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు.
  • జిల్లాలోని కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
  • ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షుడు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో జరిగింది.

ఏఐటీయూసీ జిల్లా మహాసభలను జయప్రదం చేయాలి
జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ పిలుపు
ఏఐటీయూసీ జిల్లా నాలుగో మహాసభలు ఈ నెల 26న ఆసిఫాబాద్‌లోని మైనార్టీ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించనున్నట్లు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్ తెలిపారు. జిల్లాలోని కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని మహాసభలను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ డిపో కమిటీ సమావేశం యూనియన్ ఉపాధ్యక్షుడు జాడి లక్ష్మణ్ అధ్యక్షతన ఆసిఫాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో జరిగింది. ఈ సందర్భంగా బోగే ఉపేందర్ మాట్లాడుతూ ఆర్టీసీని వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని, అపాయింట్‌మెంట్ తేదీ ప్రకటించాలని, ఆర్టీసీ కార్మికుల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, ఆర్టీసీ కార్మికులపై అధికారుల వేధింపులను నిలిపివేయాలని ఆయన కోరారు. రోజురోజుకూ అధికారుల వేధింపులు పెరుగుతున్నాయని, అవి ఆగకపోతే టీజీఎస్ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
సీసీఎస్ ఎన్నికలు నిర్వహించాలని, బ్రీత్ అనలైజర్ యంత్రంతో కార్మికులను ఇబ్బందులకు గురి చేయొద్దని, ప్యాసింజర్ గ్రీటింగ్స్ పేరుతో కార్మికుల మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు. అలాగే ఆర్టీసీ కార్మికులకు కనీస పెన్షన్ రూ.25 వేలుగా నిర్ణయించాలని, డీడీల పేరుతో యాజమాన్యం కార్మికులను శ్రమదోపిడీకి గురి చేస్తోందని, సెలవులు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు, ఎంప్లాయిస్ యూనియన్ సలహాదారు దివాకర్ గౌడ్, చైర్మన్ మల్లికార్జున్, డిపో కార్యదర్శి ఏల్పుల అశోక్, సహాయ కార్యదర్శి నరేష్, సునీల్, సుప్రీత్, ఎస్. తిరుపతి, రాజలింగ్, వెంకటేశుతో పాటు ఇతరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *