ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్నాం…
!) ఏం.టి.ఎస్.ఉపాధ్యాయుల సమస్యలు
త్వరలో పరిష్కరిస్తాం
!)ఎన్.టి.ఏ. రాష్ట్ర, జిల్లా ప్రతినిధులు
రాష్ట్ర, జిల్లాలోని ఉపాద్యాయులు సమస్యలు నిరంతర పరిష్కారం కోసం అవిశ్రాంతంగా తమ సంఘం కృషి చేస్తున్నదని నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ అన్నారు.నూతన ఆంగ్ల సంవత్సరం…2026 ప్రారంభం సందర్భంగా గురువారం జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్ర ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన ఎన్.టి.ఏ. ప్రతినిధులు బృందం శుభాకాంక్షలు తెలిపి ఆయనను దుశాలువలు కప్పి,భోకేలను అందించి ఘనంగా సన్మానించింది.నోబుల్ టీచర్స్ అసోసియేషన్ …2026 సంవత్సరపు కేలండర్,డైరీలను జిల్లా విద్యాశాఖ అధికారిచే ఆవిష్కరింపజేశారు.అనంతరం కార్యాలయం వెలుపల రాష్ట్ర గౌరవ అధ్యక్షులు రెడ్డి రమేష్ పత్రికలవారితో మాట్లాడుతూ…..
ఉపాధ్యాయులకు ఎంతో ఉపయోగకరంగా మంచి సమాచారంతో రాష్ర్ట శాఖా తరఫున ముద్రించిన నోబుల్ టీచర్స్ అసోసియేషన్ కేలండర్ – 2026 చాలా బాగుందని కితాబిచ్చారు. జిల్లా అధ్యక్షులు డాక్టర్ జయప్రకాష్ నాయుడు,జిల్లా ప్రధాన కార్యదర్శి చందనం రామయ్య లు మాట్లాడుతూ……
నోబుల్ టీచర్స్ అసోసియేషన్ తరఫున ఈ ప్రభుత్వానికి అనేక రకాల ఉపాద్యాయుల సమస్యలు తెలుపడం తెలిసిందేనన్నారు.సమస్యలు పరిష్కరించుకోవడంలోనూ తమ సంఘం తనదైన శైలిలో ప్రత్యేకతలు చూపుతుందన్నారు.రాష్ట్రంలోని ఉపాద్యాయుల పలు పెండింగ్ సమస్యలతో పాటు ఎం.టి.ఎస్ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో అడుగులు వేస్తున్నట్లు వెల్లడించారు.త్వరలో 1998 ఏం.టి.ఎస్. ఉపాద్యాయులకు మేలుచేసే ఒకటి రెండు అంశాలు తమ దృష్టిలో వుందన్నారు.సాధ్యమైనంత అతి తక్కువ కాలంలో పరిష్కరింప బడుతుoదని విశ్వసించారు.ఈ కార్యక్రమంలో ఎన్.టి.ఏ.రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వర కుమార్,జిల్లా ఉపాధ్యక్షులు ఏ.ఆర్.కుమార్, జిల్లా ఫైనాన్స్ కార్యదర్శి బాబు రెడ్డి, జిల్లా కార్యదర్శి రుక్మాంగద, కుప్పం డివిజన్ కన్వీనర్ శ్రీరాములు, చిత్తూరు నగరం అధ్యక్షురాలు దేవకి తదితరులు పాల్గొన్నారు.


