జనవరి 25 @ గూడూరు
స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఓటర్ల దినోత్సవం సందర్భంగా జిల్లా స్థాయిలో జరిగిన వివిధ పోటీలలో గెలుపొందిన విషయం విధితమే. అయితే విజేతలు అయిన విద్యార్థిని విద్యార్థులు బిఏ రెండవ సంవత్సరం చదువుతున్న ఆర్. శ్రీనివాసులు, బీకాం మొదటి సంవత్సరం చదువుతున్న పి. శిరీష లు పద్మావతి మహిళా యూనివర్సిటీ ఆవరణంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం లో తిరుపతి జిల్లా కలెక్టర్ మరియు ఎలక్షన్ ఆఫీసర్ అయిన డా. ఎస్. వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ప్రశంసాపత్రాలు అందుకున్నారు. అదేవిధంగా గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిలో డిబేట్లో పాల్గొని ప్రధమ బహుమతి పొందిన బీకాం మూడో సంవత్సరం చదువుతున్న ఎ. సూర్య మౌనిక మండల రెవెన్యూ అధికారిచే ప్రశంసా పత్రము మరియు బహుమతి అందుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి అధ్యాపక సిబ్బంది మరియు అధ్యాపకేతర సిబ్బంది విజేతలైన విద్యార్థులను అభినందించారు.



