Saturday, 21 February 2026
  • Home  
  • ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం
- గూడూరు

ఎస్.కె.ఆర్ డిగ్రీ కళాశాలలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం

గూడూరు @ 21 ఫిబ్రవరి స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకురాలు తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీవాణి, జెకెసి కోఆర్డినేటర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవి రాజు తదితరులు మాట్లాడుతూ 1952లో బంగ్లాదేశ్‌లో తమ మాతృభాష (బెంగాలీ) కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్మృత్యర్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, మాతృభాష ప్రాముఖ్యతను గుర్తించడం మరియు అంతరించిపోతున్న భాషలను కాపాడుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని, ఇది బహుభాషావాదాన్ని ప్రోత్సహిస్తూ, విద్య మరియు సామాజిక జీవనంలో మాతృభాష ప్రాధాన్యతను తెలియజేస్తుందని, మాతృభాషను రక్షించడం మరియు ఆదరించడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని, విద్యార్థులకు, ముఖ్యంగా ప్రాథమిక విద్యలో, మాతృభాషలో బోధన చేయడం వల్ల సులభంగా అర్థం చేసుకునే శక్తి పెంపొందుతుందని, ప్రపంచంలో వేలాది భాషలు ఉన్నాయని, వాటిలో అనేక భాషలు అంతరించిపోతున్నాయని, ఈ రోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని, బహుభాషావాదం సమాజంలో సమ్మిళితత్వాన్ని, ఇతర సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంచుతుందని తెలియజేశారు. అనంతరం తెలుగు భాష ప్రాధాన్యతపై నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, డాక్టర్ శైలజ, శ్రీమతి కృపా కరుణ వాణి, లక్ష్మీ హిమ బిందు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

గూడూరు @ 21 ఫిబ్రవరి
స్థానిక ఎస్ కే ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృభాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, కార్యక్రమ నిర్వాహకురాలు తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ ఝాన్సీవాణి, జెకెసి కోఆర్డినేటర్ డాక్టర్ కే. కోటేశ్వరరావు, అధ్యాపకులు డాక్టర్ కే. శివప్రసాద్, డాక్టర్ గోవిందు సురేంద్ర, శ్రీధర్ శర్మ, డాక్టర్ విజయ మహేష్, డాక్టర్ పీర్ కుమార్, రవి రాజు తదితరులు మాట్లాడుతూ 1952లో బంగ్లాదేశ్‌లో తమ మాతృభాష (బెంగాలీ) కోసం ప్రాణ త్యాగం చేసిన అమరవీరుల స్మృత్యర్థం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం 2000 ఫిబ్రవరి 21 నుండి ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, భాషా, సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రోత్సహించడం, మాతృభాష ప్రాముఖ్యతను గుర్తించడం మరియు అంతరించిపోతున్న భాషలను కాపాడుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని, ఇది బహుభాషావాదాన్ని ప్రోత్సహిస్తూ, విద్య మరియు సామాజిక జీవనంలో మాతృభాష ప్రాధాన్యతను తెలియజేస్తుందని, మాతృభాషను రక్షించడం మరియు ఆదరించడం ద్వారా సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకోవాలని, విద్యార్థులకు, ముఖ్యంగా ప్రాథమిక విద్యలో, మాతృభాషలో బోధన చేయడం వల్ల సులభంగా అర్థం చేసుకునే శక్తి పెంపొందుతుందని, ప్రపంచంలో వేలాది భాషలు ఉన్నాయని, వాటిలో అనేక భాషలు అంతరించిపోతున్నాయని, ఈ రోజు వాటిని కాపాడుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తుందని, బహుభాషావాదం సమాజంలో సమ్మిళితత్వాన్ని, ఇతర సంస్కృతుల పట్ల గౌరవాన్ని పెంచుతుందని తెలియజేశారు. అనంతరం తెలుగు భాష ప్రాధాన్యతపై నిర్వహించిన వివిధ పోటీలలో గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు ప్రిన్సిపాల్ బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ డాక్టర్ పి. నారాయణరాజు, డాక్టర్ శైలజ, శ్రీమతి కృపా కరుణ వాణి, లక్ష్మీ హిమ బిందు తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.