అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండలం ఆదూరుపల్లిలో పందుల బెడద రోజురోజుకు పెరుగుతోంది. వీటి కారణంగా రోడ్డు ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని పంచాయతీ సెక్రటరీ రఫీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.ఈ మేరకు ఎస్సై తిరుమలరావు పందుల పెంపకందారులను తీవ్రంగా హెచ్చరించారు.అయితే వారిలో మార్పు రాకపోవడంతో,పందులు బస్టాండ్ వద్ద, రోడ్లపై స్వేచ్ఛగా తిరుగుతున్నాయని తెలుసుకున్న ఎస్సై స్వయంగా ఆదురుపల్లికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.అనంతరం సంబంధిత పందుల యజమానులకు ఫోన్ చేసి పది రోజుల్లోగా పందులను గ్రామం బయటకు తరలించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.దాంతో గురువారం పెంపకందారులు వెంటనే స్పందించి గ్రామంలోని పందులను పట్టుకొని గ్రామం బయటకు తరలించారు. గ్రామంలో నెలకొన్న సమస్యను పరిష్కరించిన ఎస్సై తిరుమలరావుకు గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. గతంలో కూడా ఆదూరుపల్లిలో ఎస్సై తిరుమలరావు పరిసరాల పరిశుభ్రత గురించి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు.


