ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టాలి
ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్..
ప్రభుత్వం నుంచి సబ్సిడీలు, రాయితీలు పొందుతూ పరిశ్రమలు స్థాపిస్తున్న పరిశ్రమలు ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు డిమాండ్ చేశారు. ఆదివారం రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, తూర్పుగోదావరి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఉందుర్తి సుబ్బారావు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం విచ్చేసినట్లు తెలిపారు. ప్రజల సొమ్ముతో ప్రభుత్వం ద్వారా భూములు, బ్యాంకు లోన్లు, ఇతర మౌలిక వసతులు పొంది పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్న పారిశ్రామికవేత్తలు తమ పరిశ్రమలలో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ద్వారా పార్లమెంట్ లో చట్టాన్ని తీసుకురావాలని కోరారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు తీసుకు రాకపోవడం వలన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులు పెరుగుతున్నారని వివరించారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలలో 100 కు 75 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో విచ్చలవిడిగా కల్తీ మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని తెలిపారు. కల్తి మధ్యం అమ్మకాలను అరికట్టాలని రిమాండ్ చేశారు. సెల్ఫీ మద్యం తాగి ప్రజలు కిడ్నీ లివర్ ఉదర సంబంధిత వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కల్తీ మద్యం అమ్మకాలు అరికట్టి, కల్తీ మద్యం అమ్మకాలు చేస్తున్న సంబంధిత వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఉందుర్తి సుబ్బారావు మాట్లాడుతూ రాష్ట్ర ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు దాసరి సువర్ణ రాజు రాష్ట్ర పర్యటనలో భాగంగా రాజమహేంద్రవరం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కొన్ని ముఖ్యమైన తీర్మానాలు ఆమోదించినట్లు వివరించారు. వీటిలో ముఖ్యమైనవి ఎస్సీ వర్గీకరణ కు కేంద్ర, రాష్ట్రాలు అమలు చట్టబద్ధత కల్పించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ తీర్మానం చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ఉద్యోగాలలో ఎస్సీ బి క్యాటగిరీకి చెందిన 1,633 మంది ఉద్యోగాలు పొందారని ప్రభుత్వ అమలు చేస్తున్న వర్గీకరణ విధానం పట్ల హర్షవర్తం చేస్తూ తీర్మానం చేశామన్నారు. అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇతర సంక్షేమ పథకాలకు దారి మళ్లించకుండా ఎస్సీల సంక్షేమానికి ఖర్చు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ బ్యాక్ లాగ్ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఎస్సీలలో ఉన్న 59 ఒక్క కులాలకు ఉపయోగపడే విధంగా ఎస్సీ కార్పొరేషన్ నిధులు, బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఆర్పిఎస్ గుంటూరు జిల్లా అధ్యక్షులు తలారి నాని మాదిగ కోనసీమ జిల్లా అధ్యక్షులు కన్నిపాముల శ్రీనివాస్ మాదిగ, తూర్పుగోదావరి జిల్లా ఇన్చార్జి బొచ్చు చినబాబు మాదిగ, గుంటూరు జిల్లా ప్రతినిధులు కళ్యాణి జార్జి మాదిగ, కందుల జార్జ్ మాదిగ, వెంకట్ మాదిగ, రామచంద్రాపురం ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ దోమ్మలపాటి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


