Tuesday, 24 March 2026
  • Home  
  • ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్*
- అమరావతి

ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్*

*ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్* *నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి* *మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* *అమరావతి, నవంబర్,( విశాఖ పున్నమి ప్రతినిధి):* ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తాం, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

*ఎస్సీ, ఎస్టీ యువతకు ఉచితంగా యూపీఎస్సి సివిల్స్ కోచింగ్*

*నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి*

*మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి*

*అమరావతి, నవంబర్,( విశాఖ పున్నమి ప్రతినిధి):*

ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగ యువతకు యూపీఎస్సీ సివిల్స్ ఉచిత శిక్షణ ఇస్తున్నామని అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. బుధవారం నాడు విడుదల చేసిన పత్రిక ప్రకటనలో మంత్రి మాట్లాడుతూ..రాష్ట్రంలోని 340 మంది నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ యువతకు యూపీఎస్సి సివిల్స్ ప్రిలిమినరీ ఎగ్జామ్ కి ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం.
విజయవాడ,విశాఖపట్నం, తిరుపతి డా.బి.ఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిళ్లలో ఈ శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. 4 నెలల శిక్షణా కాలంలో (10.12.2025 నుంచి 10.04.2026 వరకు) అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తాం. ఈ నెల 13 నుంచి 16 వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించబడతాయి. అభ్యర్థులకు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించి మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయిస్తాం, మహిళలకు 33 శాతం సీట్లు కేటాయిస్తాం. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, మరిన్ని వివరాలకు https://apstudycircle.apcfss.in వెబ్ సైట్ ని సంప్రదించాలని మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజ నేయస్వామి తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.