செய்தியின் முக்கிய அம்சங்கள்
- నర్రవాడ, అక్టోబర్ 6: నర్రవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ ఎస్టీ కాలనీకి చెందిన పేద కుటుంబాలు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు.
- కాలనీలో 42 అర్హులైన పేద కుటుంబాలు ఉన్నాయని, గతంలో మూడుసార్లు దరఖాస్తు చేసినా స్థలాలు మంజూరు కాలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
- బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు.
నర్రవాడ, అక్టోబర్ 6: నర్రవాడ గ్రామంలోని శ్రీ వెంగమాంబ ఎస్టీ కాలనీకి చెందిన పేద కుటుంబాలు ఇంటి స్థలాలు మంజూరు చేయాలని ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్‌కు వినతిపత్రం సమర్పించారు. కాలనీలో 42 అర్హులైన పేద కుటుంబాలు ఉన్నాయని, గతంలో మూడుసార్లు దరఖాస్తు చేసినా స్థలాలు మంజూరు కాలేదని వారు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు.
బీజేపీ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షుడు మేకపాటి మాల్యాద్రి నాయుడు ఆధ్వర్యంలో సమస్యను ఎమ్మెల్యేకు వివరించారు. స్పందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అర్హులైన ప్రతి కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో దుత్తలూరు టీడీపీ మండల కన్వీనర్ ఉండేల గురవారెడ్డి, జనసేన మండల అధ్యక్షుడు దుంపలగడ్డ రవి, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.