ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన ఎస్.ఆర్. రంగనాథన్ కృషిని సేవలను గుర్తు చేసుకుంటూ గ్రంథాలయ వారోత్సవాలు సాధారణంగా స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుండి 20 వరకు జరుగుతాయని, వారోత్సవాలు గ్రంథాలయాల ప్రాముఖ్యతను, వాటిలో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సహాయపడతాయని విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణంలో ఉన్న లైబ్రరీని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, లైబ్రేరియన్ డాక్టర్ పి. విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివ ప్రసాద్, డాక్టర్ గోవింద్ సురేంద్ర, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ శైలజ, డాక్టర్ బి. పీర్ కుమార్, రవి రాజు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గ్రంథాలయ వారోత్సవాలు
ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో డిపార్ట్మెంట్ ఆఫ్ లైబ్రరీ ఆధ్వర్యంలో గ్రంథాలయ వారోత్సవాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. సింహాద్రి మాట్లాడుతూ భారతదేశంలో గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేసిన ఎస్.ఆర్. రంగనాథన్ కృషిని సేవలను గుర్తు చేసుకుంటూ గ్రంథాలయ వారోత్సవాలు సాధారణంగా స్వర్గీయ పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా నవంబర్ 14 నుండి 20 వరకు జరుగుతాయని, వారోత్సవాలు గ్రంథాలయాల ప్రాముఖ్యతను, వాటిలో పుస్తక పఠనం యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి సహాయపడతాయని విద్యార్థిని విద్యార్థులు కళాశాల ఆవరణంలో ఉన్న లైబ్రరీని సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు, లైబ్రేరియన్ డాక్టర్ పి. విజయ మహేష్, ఫిజికల్ డైరెక్టర్ పి. నారాయణ రాజు, అధ్యాపకులు డాక్టర్ కే. శివ ప్రసాద్, డాక్టర్ గోవింద్ సురేంద్ర, శ్రీధర్ శర్మ, భీమవరపు లక్ష్మి, డాక్టర్ ఝాన్సీ వాణి, కృపా కరుణ వాణి, డాక్టర్ శైలజ, డాక్టర్ బి. పీర్ కుమార్, రవి రాజు, గోపాల్, రమేష్, శైలజ, శ్రీలత, పద్మమ్మ, తదితర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

