

“
ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఎస్కార్ట్ సమయంలో నిందితుడు పరారైన సంఘటన నేపథ్యంలో, అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ జిల్లా వ్యాప్తంగా విధులు నిర్వర్తిస్తున్న ఆర్మ్డ్ రిజర్వ్, లా అండ్ ఆర్డర్ సిబ్బందికి కఠిన సూచనలు జారీ చేశారు.
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ…
ఎస్కార్ట్ విధులకు బయలుదేరే ముందు నిందితులపై నమోదైన కేసులు, వారి నేర చరిత్ర, నేరాల తీవ్రత గురించి సిబ్బందికి అధికారులు తప్పనిసరిగా అవగాహన కల్పించాలని ఆదేశించారు.
కోర్టు కానిస్టేబుల్స్, ఎస్కార్ట్ పోలీసులు, జైలు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ప్రతి ముద్దాయిని చట్టప్రకారం సంకెళ్లతో భద్రంగా బంధించడం తప్పనిసరి.
రిమాండ్ ఖైదీలు, కరడుగట్టిన నేరస్థులు, పునరావృత నేరస్తుల విషయంలో అదనపు భద్రతా చర్యలు తీసుకోవాలి.
ఎస్కార్ట్ వాహనం మధ్యలో ఆగిన సందర్భంలోనూ, ముద్దాయిపై నిరంతరం నిఘా ఉంచాలి.
ముద్దాయి అవసరాల నిమిత్తం వాహనం ఆపినపుడు కనీసం ఇద్దరు సిబ్బంది పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి.
అలాగే, ఎస్కార్ట్ బాధ్యతల్లో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఐపీఎస్ స్పష్టం చేస్తూ… “ముద్దాయిల ఎస్కార్ట్ విధులు అత్యంత అప్రమత్తతతో, చట్టబద్ధతతో, వృత్తి నిబద్ధతతో నిర్వహించాలి. ప్రజల భద్రతకు విఘాతం కలిగించే నిర్లక్ష్యం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబడదు” అని తెలిపారు.

