Sunday, 7 December 2025
  • Home  
  • ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.
- విశాఖపట్నం

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు. • హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు 9154282649, 9154282654 – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ .ప్రభాకర రావు. *విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ప్రభుత్వం వారి G.O Ms No. 225, MA&UD (M) Dept..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/ (urban Local Bodies) పరిధిలోని బిల్డింగ్స్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ ప్రభుత్వం విడుదల చేసిందని,అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్, ప్లాన్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వమువారు కల్పించియున్నారని , ఈ విషయమై ప్రజల సౌకర్యార్థం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ స్కీములకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడమైనదని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020ని సవరించింది, ప్రభుత్వము వారు G.O 134, MA&UD (M) Dept, తేదీ: 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025లోపు దరఖాస్తు చేసుకోవాలని మరియు స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించవలెనని ప్రభుత్వం తెలియజేసిందని తెలిపారు. తదుపరి ప్రభుత్వము వారు జివో 1173 ప్రకారం LRS దరఖాస్తులు చేసుకునేందుకు 2026 జనవరి 23 వరకు పొడిగించారన్నారు. కావున పైన పేర్కొన్న ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, GVMCలో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025 మరియు అనుమతి లేని లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నియమాలు 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, ప్రజలను మరింత ప్రోత్సహించడానికి మరియు ఈ కార్యాలయ పనివేళల్లో BPS మరియు LRS ల పై ప్రజలకు అవగాహన కల్పించి సహాయం అందించడానికి మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రజల సౌకర్యార్థం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ కార్యాలయం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు., 9154282649 మరియు 9154282654 కావున ఈ అవకాశమును మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు అందరు సద్వినియోగము చేసుకోగలరని ఇందు మూలముగా తెలియజేయడమైనదని చీప్ సిటీ ప్లానర్ తెలిపారు.

ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు.

• హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు 9154282649, 9154282654

– జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ .ప్రభాకర రావు.

*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- * మహా విశాఖపట్నం నగరపాలకసంస్థ పరిధిలో గల పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ప్రభుత్వం వారి G.O Ms No. 225, MA&UD (M) Dept..12.11.2025 ప్రకారము నగర పాలక సంస్థలు/ (urban Local Bodies) పరిధిలోని బిల్డింగ్స్ క్రమబద్ధీకరణకు (బిపిఎస్) స్కీమ్ ప్రభుత్వం విడుదల చేసిందని,అనుమతి లేకుండా కట్టిన బిల్డింగ్స్, ప్లాన్స్ కి డివియేషన్ ఉన్న బిల్డింగ్స్ ఒకేసారి రెగ్యులరైజ్ చేసుకునే అవకాశం ప్రభుత్వమువారు కల్పించియున్నారని , ఈ విషయమై ప్రజల సౌకర్యార్థం ఎల్.ఆర్.ఎస్, బి.పి.ఎస్ స్కీములకు సంబంధించి జీవీఎంసీ ప్రధాన కార్యాలయం టౌన్ ప్లానింగ్ విభాగంలో హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడమైనదని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకర రావు శనివారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు.
అదే విధముగా ఇటీవలే ప్రభుత్వం వారి G.O.లో ఆంధ్రప్రదేశ్ ఆమోదం పొందని లేఅవుట్లు మరియు ప్లాట్ల క్రమబద్ధీకరణ నిబంధనలు, 2020ని సవరించింది, ప్రభుత్వము వారు G.O 134, MA&UD (M) Dept, తేదీ: 26.07.2025 ప్రకారం, దరఖాస్తుదారు G.O జారీ చేసిన తేదీ నుండి 90 రోజుల ముందు అంటే 25.10.2025లోపు దరఖాస్తు చేసుకోవాలని మరియు స్వీకరించిన దరఖాస్తులను 25.04.2026 లోపు పరిష్కరించవలెనని ప్రభుత్వం తెలియజేసిందని తెలిపారు. తదుపరి ప్రభుత్వము వారు జివో 1173 ప్రకారం LRS దరఖాస్తులు చేసుకునేందుకు 2026 జనవరి 23 వరకు పొడిగించారన్నారు.
కావున పైన పేర్కొన్న ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని, GVMCలో బిల్డింగ్ పెనలైజేషన్ స్కీమ్ 2025 మరియు అనుమతి లేని లేఅవుట్లు మరియు ప్లాట్ల నియంత్రణ నియమాలు 2020ని సమర్థవంతంగా అమలు చేయడానికి మరియు ఉన్నత అధికారుల సూచనల ప్రకారం, ప్రజలను మరింత ప్రోత్సహించడానికి మరియు ఈ కార్యాలయ పనివేళల్లో BPS మరియు LRS ల పై ప్రజలకు అవగాహన కల్పించి సహాయం అందించడానికి మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయం, పట్టణ ప్రణాళిక విభాగంలో ప్రజల సౌకర్యార్థం టౌన్ ప్లానింగ్ సిబ్బంది తో హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయడం జరిగిందని , ఈ కార్యాలయం హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లు., 9154282649 మరియు 9154282654

కావున ఈ అవకాశమును మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ పరిధిలో గల ప్రజలు అందరు సద్వినియోగము చేసుకోగలరని ఇందు మూలముగా తెలియజేయడమైనదని చీప్ సిటీ ప్లానర్ తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.