Thursday, 26 March 2026
  • Home  
  • ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
- కామారెడ్డి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి ఐదు నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పార్టీ సభ్యులు తెలిపారు.కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తాడ్వాయి మండ లంలోని భ్రహ్మజివాడి గ్రామంలో ఉన్న సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్హా హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎల్లా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతోష లతో, ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని సిద్దేశ్వర స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. “ఎల్లారెడ్డి ప్రజలపై సిద్దేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా ను” అని భావోద్వేగంగా తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన భక్తుల సౌకర్యాల అంశంపై స్పందించిన మదన్ మోహన్ గారు, ఆలయానికి చేరుకోవడానికి భక్తులు ఏకంగా 350 మెట్లు ఎక్కవలసి వస్తుందని గుర్తించి, త్వర లోనే మెట్ల నిర్మాణం మరియు సీసీ రోడ్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భక్తు ల సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తామని అన్నారు.అలాగే ఈ ఆల యాన్ని రాష్ట్రవ్యాప్త పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ఇటీవల సదాశివనగర్ మండలంలోని భూపాల్లి గ్రామ శివాలయం మరియు రాజంపేట్ మండలం లోని కొండాపూర్ గ్రామ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇచ్చిన హామీ మేరకు కొండ శిఖరం పైకి సీసీ రోడ్ నిర్మాణం పూర్తయ్యిందని గుర్తు చేశారు.ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి, ఆలయాల అభ్యున్నతి, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం అందించే అవకాశా లను సమర్థంగా వినియోగించి, ప్రతి పుణ్యక్షేత్రం అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపా రు.

కామారెడ్డి ఐదు నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) :

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పార్టీ సభ్యులు తెలిపారు.కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తాడ్వాయి మండ లంలోని భ్రహ్మజివాడి గ్రామంలో ఉన్న సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్హా హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎల్లా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతోష లతో, ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని సిద్దేశ్వర స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. “ఎల్లారెడ్డి ప్రజలపై సిద్దేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా ను” అని భావోద్వేగంగా తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన భక్తుల సౌకర్యాల అంశంపై స్పందించిన మదన్ మోహన్ గారు, ఆలయానికి చేరుకోవడానికి భక్తులు ఏకంగా 350 మెట్లు ఎక్కవలసి వస్తుందని గుర్తించి, త్వర లోనే మెట్ల నిర్మాణం మరియు సీసీ రోడ్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భక్తు ల సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తామని అన్నారు.అలాగే ఈ ఆల యాన్ని రాష్ట్రవ్యాప్త పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ఇటీవల సదాశివనగర్ మండలంలోని భూపాల్లి గ్రామ శివాలయం మరియు రాజంపేట్ మండలం లోని కొండాపూర్ గ్రామ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇచ్చిన హామీ మేరకు కొండ శిఖరం పైకి సీసీ రోడ్ నిర్మాణం పూర్తయ్యిందని గుర్తు చేశారు.ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి, ఆలయాల అభ్యున్నతి, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం అందించే అవకాశా లను సమర్థంగా వినియోగించి, ప్రతి పుణ్యక్షేత్రం అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపా రు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.