Story highlights
- ఎలమంచిలి: అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.12.40 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
- ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
- కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ ఎన్నికల ఇన్ఛార్జి కొండపల్లి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఎలమంచిలి: అనారోగ్య సమస్యలతో వైద్య చికిత్స పొందుతున్న పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ద్వారా మంజూరైన రూ.12.40 లక్షల చెక్కులను 18 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఎలమంచిలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి, ఏపీఆర్డీసీ చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి మాజీ ఎంపీ పప్పల చలపతిరావు, అనకాపల్లి జిల్లా టీడీపీ ఎన్నికల ఇన్ఛార్జి కొండపల్లి అప్పలనాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు బత్తుల తాతయ్యబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో ధూళి రంగనాయకులు, ఇత్తంశెట్టి సన్యాసినాయుడు, గొర్ల నానాజీ, పీల తులసీరామ్, విజయబాబు, ఎరిపిళ్లి చిట్టిబాబు, దాడి రమేష్, ఆర్ఎస్ నాగేశ్వరరావు, ఆడారి ఆదిమూర్తి, గొన్నబతుల నాగేశ్వరరావు, నారాయణమ్మ తదితర టీడీపీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.