కాకినాడ జిల్లా, మార్చి 7 – పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్):
ప్రత్తిపాడు నియోజకవర్గం, ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో బసా ఎర్రబాబు గారి కుమార్తె వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు కూటమి నాయకుడు భార్లపూడి క్రాంతి ముఖ్య అతిథిగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు. భార్లపూడి క్రాంతి మాట్లాడుతూ నూతన దంపతులు సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


