








శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం, నిమ్మాడలో గ్రామంలో, దివంగత మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు గారి 13 వర్థంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది.
ఎర్రన్నాయుడు గారి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులతో కలిసి నివాళులు అర్పించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు గారు, ఎర్రన్నాయుడు గారి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు కేంద్ర పౌరవ విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు, సోదరులు పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్ గారు , ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో పలాస మాజీ శాసనసభ్యులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్,పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు,మాజీ శాసన మండలి సభ్యులు విశ్వప్రసాద్, కూటమి నాయకులు హాజరై ఎర్రన్నాయుడు గారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

