Sunday, 7 December 2025
  • Home  
  • ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం
- Featured

ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం

మేమున్నామని!_ మీకేం కాదని! ===================== _ ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం _ 21 22 డివిజన్లలో 40 రోజులపాటు నిరుపేదల ఆకలి తీర్చిన వైనం! _ ప్రతి రోజు 400 మందికి ఆహారం అందించిన సిపిఎం కార్యకర్తలు! _ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16 వేల మంది కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ! _ సేవే లక్ష్యంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు తోడుగా నిలిచిన దాతలు దేశంలో కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే! దాంతో ప్రజా జీవనానికి కూడా లాక్ డౌన్ పడ్డట్లయింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఉపాధి కోల్పోయారు ముఖ్యంగా నిరుపేదలు, కార్మికుల కు జీవనోపాధి లేక వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర సమయంలో నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటా ఏమోనని పేదలు ఆశించారు. ప్రభుత్వం కుటుంబానికి వెయ్యి రూపాయలు, తలకు 5 కేజీల రేషన్ బియ్యం అందించి మీ కష్టం మీరు పడండి అంటూ చేతులు దులుపు కుంది. అటువంటి సమయంలో మేమున్నామంటూ సిపిఎం కార్యకర్తలు చేదోడువాదోడుగా నిలిచి గత నలభై రోజులుగా వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్లలో శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఏ పూటకాపూట సంపాదించుకొని కడుపు నింపుకునే వారే! లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నా వారికి ఆ ప్రాంతంలో ఉన్న సిపిఎం కార్యకర్తలు అండగా నిలిచారు.21 22 డివిజన్ల సిపిఎం శాఖల ఆధ్వర్యంలో ఒక నిరంతర ఆహార తయారీ కేంద్రాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కార్మికులకి, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందజేసేందుకు, కార్యకర్తలే రంగంలోకి దిగి అన్నం కూరలు వండి ప్యాకెట్లు చేసేవారు. సీపీఎం రూరల్ కమిటీ సభ్యుడు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ ఒక టీం గా ఏర్పడి క్రమశిక్షణతో పేదలకు ఆహార పొట్లాలు అందించేందుకు నిరంతరం కృషి చేశారు. పేదలకు సహాయం చేసే సందర్భంలో కార్యకర్తలు తమ కుటుంబ సమస్యలు, ఇబ్బందులను కూడా మరిచారు. కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయడం ద్వారానే 40 రోజులపాటు నిరంతరంగా 16 వేల మంది ఆకలి బాధలు తీరుస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. మీరు చల్లగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలు అందిస్తున్న దీవెనలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు తోడ్పడాలని కోరుకుందాం. ఇటువంటి విపత్కర సమయాల్లో ఆ ప్రాంతంలో పలువురు దాతలు సిపిఎం కార్యకర్తలు చేస్తున్న కృషిని గుర్తించి మేము మీకు తోడుగా ఉంటామని చేయూత నందించడం అభినందనీయం.

మేమున్నామని!_ మీకేం కాదని!
=====================
_ ఎర్రజెండా అండగా… సేవే లక్ష్యంగా కదిలిన ఎర్రసైన్యం
_ 21 22 డివిజన్లలో 40 రోజులపాటు నిరుపేదల ఆకలి తీర్చిన వైనం!
_ ప్రతి రోజు 400 మందికి ఆహారం అందించిన సిపిఎం కార్యకర్తలు!
_ లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన 16 వేల మంది కార్మికులకు ఆహార పొట్లాల పంపిణీ!
_ సేవే లక్ష్యంగా కృషి చేస్తున్న కార్యకర్తలకు తోడుగా నిలిచిన దాతలు

దేశంలో కరోనా మహమ్మారిని నిరోధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చి 24 నుంచి లాక్ డౌన్ విధించిన విషయం అందరికీ తెలిసిందే! దాంతో ప్రజా జీవనానికి కూడా లాక్ డౌన్ పడ్డట్లయింది. ప్రజలంతా ఇంటికే పరిమితం కావడంతో ఉపాధి కోల్పోయారు ముఖ్యంగా నిరుపేదలు, కార్మికుల కు జీవనోపాధి లేక వారి కుటుంబాలు గడవడం కష్టంగా మారింది. ఇటువంటి విపత్కర సమయంలో నైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమైనా ఆదుకుంటా ఏమోనని పేదలు ఆశించారు. ప్రభుత్వం కుటుంబానికి వెయ్యి రూపాయలు, తలకు 5 కేజీల రేషన్ బియ్యం అందించి మీ కష్టం మీరు పడండి అంటూ చేతులు దులుపు కుంది. అటువంటి సమయంలో మేమున్నామంటూ సిపిఎం కార్యకర్తలు చేదోడువాదోడుగా నిలిచి గత నలభై రోజులుగా వారి ఆకలి బాధలు తీరుస్తున్నారు. నెల్లూరు రూరల్ పరిధిలోని 21 22 డివిజన్లలో శ్రీకాకుళం విజయనగరం నుంచి వచ్చిన వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువ మంది ఉన్నారు. వీరంతా ఏ పూటకాపూట సంపాదించుకొని కడుపు నింపుకునే వారే! లాక్‌డౌన్‌ కారణంగా ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పూట గడవడం కష్టంగా ఉన్నా వారికి ఆ ప్రాంతంలో ఉన్న సిపిఎం కార్యకర్తలు అండగా నిలిచారు.21 22 డివిజన్ల సిపిఎం శాఖల ఆధ్వర్యంలో ఒక నిరంతర ఆహార తయారీ కేంద్రాన్ని దాతల సహకారంతో ఏర్పాటు చేశారు. ప్రతిరోజు కార్మికులకి, నిరుపేదలకు ఆహార ప్యాకెట్లు అందజేసేందుకు, కార్యకర్తలే రంగంలోకి దిగి అన్నం కూరలు వండి ప్యాకెట్లు చేసేవారు. సీపీఎం రూరల్ కమిటీ సభ్యుడు, శాఖా కార్యదర్శులు, పార్టీ సభ్యులు, ప్రజా సంఘాల కార్యకర్తలు అందరూ ఒక టీం గా ఏర్పడి క్రమశిక్షణతో పేదలకు ఆహార పొట్లాలు అందించేందుకు నిరంతరం కృషి చేశారు. పేదలకు సహాయం చేసే సందర్భంలో కార్యకర్తలు తమ కుటుంబ సమస్యలు, ఇబ్బందులను కూడా మరిచారు. కార్యకర్తలంతా అంకితభావంతో పని చేయడం ద్వారానే 40 రోజులపాటు నిరంతరంగా 16 వేల మంది ఆకలి బాధలు తీరుస్తూ అందరికీ ఆదర్శంగా, స్ఫూర్తిగా నిలిచారు. మీరు చల్లగా ఉండాలని ఆ ప్రాంత ప్రజలు అందిస్తున్న దీవెనలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాల్లో మరింత ఉత్సాహంగా పాల్గొనేందుకు తోడ్పడాలని కోరుకుందాం. ఇటువంటి విపత్కర సమయాల్లో ఆ ప్రాంతంలో పలువురు దాతలు సిపిఎం కార్యకర్తలు చేస్తున్న కృషిని గుర్తించి మేము మీకు తోడుగా ఉంటామని చేయూత నందించడం అభినందనీయం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.