*ఎమ్మెల్యే వంశీ కృష్ణ గారి చేతుల మీదుగా దక్షిణ నియోజకవర్గం మహిళలకు కుట్టు మిషన్ ల పంపిణి.*
*విశాఖపట్నం డిసెంబర్ 6 పున్నమి ప్రతినిధి:- *
విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి చొరవతో వేదాంత కంపెనీవారి ఆర్థిక సహాయంతో ఈ రోజు జగదాంబ జంక్షన్ దగ్గర అంబికా బాగ్ లో దక్షిణ నియోజకవర్గం పేద మహిళలకు ఉచితంగా 75 మందికి కుట్టు మిషన్ లు పంపిణి చేశారు,
ఈ సందర్బంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు మాట్లాడుతూ పేద మహిళలు తన కాళ్ళ మీద తాము నిలబడాలని ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యం లో భాగంగా ఈ రోజు కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్ ఫౌండ్స్ ద్వారా వేదాంత కంపెనీ చేస్తున్న అభివృద్ధి పనులలో భాగంగా ఈ కుట్టు మిషన్ లు పంపిణి చేసారన్నారు, ప్రతి మహిళా స్వయం ప్రతిపత్తి సాధించేలా అభివృద్ధి సాదించాలి అని అన్నారు,
ఇలాంటి అభివృద్ధి పనులు భవిష్యత్తు లో వేదాంత వారి ప్రోత్సాహంతో మరిన్ని చెప్పడతామని అన్నారు,
ఈ కార్యక్రమం లో లబ్ధిదార మహిళలు ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు సేవలు మరువలేనివని,ఎమ్మెల్యే గారికి, వేదాంత కంపెనీ వారికీ కృతజ్ఞతలు తెలియచేసారు,
ఈ కార్యక్రమం లో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారితో పాటు వేదాంత కంపెనీ తరుపున శ్రీ లక్ష్మి గారు పాల్గొన్నారు మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు,


