ఫుడ్ కోర్ట్ తొలగింపు హేయమైన చర్య
స్థానిక ఎమ్మెల్యేకు సమాచారం లేకుండా షాపులు తొలగించడం చాలా బాధాకరం అన్యాయం

నిరంతరం ప్రజల్లో ఉండి పేద ప్రజల పక్షాన పోరాటాలు చేస్తూ దక్షిణ నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నిలిపేందుకు తన వంతు కృషి చేస్తున్న దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణశ్రీనివాస్ కు చెడ్డపేరు తీసుకొచ్చే విధంగా ఎమ్మెల్యే శాసనసభలో ఉండగా దక్షిణ నియోజకవర్గం లో మేయర్ మున్సిపల్ కమిషనర్ చేపట్టినటువంటి హేయమైన చర్యలను ఖండిస్తున్నాం. అదును చూసి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,పేద ప్రజల పక్షపాతి ఎమ్మెల్యే వంశీ విశాఖపట్నంలో లేని సందర్భంలో శాసనసభలో దక్షిణ నియోజకవర్గ అభివృద్ధి కోసం మాట్లాడుతున్న సమయంలో ఇటువంటి హేయమైన చర్యలు తీసుకున్న వారిని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం వెనివెంటనే క్షమాపణలు చెప్పాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు రాజు గౌడ్ యాత్ర తెలియజేశారు
మేయర్ , కమిషనర్ ఒకరిపై ఒకరు నెపం వేసుకొని, పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడితే తీవ్ర పరిణామాలకు దారి తీస్తాయి
పేద ప్రజలకు అన్యాయం జరిగితే సహించేదే లేదు

