కామారెడ్డి, 12 డిసెంబర్, ( పున్నమి ప్రతినిధి ) :
కామారెడ్డి జిల్లా,ఎల్లారెడ్డి సెగ్మెంట్లో కాంగ్రెస్ రామారెడ్డి మండలానికి చెందిన సర్పంచ్‌లకు ఎమ్మెల్యే ఘన సన్మానం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామారెడ్డి మండలం ఎల్లారెడ్డి సెగ్మెంట్లో కాంగ్రెస్ జెండా గర్వంగా ఎగురవేసిన పంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఎమ్మె ల్యే మదన్మోహన్రావు ఘనంగా సన్మానం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయా న్ని జరుపుకున్న ఈ కార్యక్రమం వైభవంగా జరిగిం ది. ఎమ్మెల్యే మదన్మోహన్రావు, ఎల్లారెడ్డి సెగ్మెంట్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేసి గెలిచిన సర్పంచ్‌లు, సభ్యులు తమ గ్రామాలను అత్యంత వైభవంగా అభివృద్ధి చేసి మోడల్ పంచాయతీలుగా మార్చా లని పిలుపునిచ్చారు. “కాంగ్రెస్ పాలిత పంచాయ తీలు గ్రామాల అభివృద్ధికి ముందంజలో ఉంటా యని ఆశీస్సులు తెలిపారు. మనం కలిసి ఈ సెగ్మెంట్‌ను జిల్లా మోడల్‌గా తీర్చిదిద్దాలి” అని ఆయన స్పష్టం చేశారు.స్థానికులు ఈ సన్మాన కార్యక్రమాన్ని ప్రశంసిస్తూ, కాంగ్రెస్ నాయకత్వంలో గ్రామీణాభివృద్ధి వేగవంతమవుతుందని ఆశాభా వం వ్యక్తం చేశారు. ఈ సంఘటన జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ ఊపందుకునేలా చేస్తోంది.కాంగ్రెస్ పాలిత పంచాయతీల విజయం ఎల్లారెడ్డి సెగ్మెంట్లో గ్రామీణాభివృద్ధికి కొత్త దిశగా మారింది. ఎమ్మెల్యే మదన్మోహన్రావు సన్మానం చేసిన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు భవిష్యత్‌లో మోడల్ గ్రామాలు రూపొందించేలా కృషి చేస్తారని సంతోషం వ్యక్తం చేశారు.


