సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం కె.జగన్నాధపురం గ్రామంలో కూటమి నాయకులతో కలిసి ఏఎంసీ డైరెక్టర్ మోర్త సత్తిబాబు బుధవారం మీడియా తో మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ పి.గన్నవరం నియోజకవర్గం కోఆర్డినేటర్ గన్నవరపు శ్రీనివాసరావు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మీ వైసీపీ పార్టీకి, మీకు చిత్తశుద్ధి ఉంటే బహిరంగ చర్చ కి రావాలి అన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులపై మీరు చేసిన అనుచిత వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. మీరు బహిరంగంగా మాట్లాడుకుందాం రండి అన్నారు. మీ వైసీపీ ప్రభుత్వంలో కె.జగన్నాధపురం గ్రామంలో పేదలకు ఇచ్చిన ఇళ్ల పట్టాల విషయంలో డబుల్ పేమెంట్ లు తీసుకున్న విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. కానీ మేము ఎప్పుడూ ఆ విషయాన్ని ప్రస్తావించ లేదన్నారు. మీరు అన్న అనుచిత వ్యాఖ్యలు నిరూపించకపోతే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కి బహిరంగ క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ అధ్యక్షులు బొబ్బిలి బాలాజీ, బీజేపీ అయినవిల్లి మండల అధ్యక్షులు యనమదల వెంకటరమణ, జనసేన నాయకులు యర్రంశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


