ఎమ్మెల్యే కాకర్ల ఆదేశాలతో చెరువుల అత్యవసర పనులకు 47.60 లక్షలు మంజూరు..
బలహీనంగా ఉన్న చెరువుల పనులను త్వరగా పూర్తి చేయండి..
ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ ను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి..
ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ ఆదేశాలతో వింజమూరు మండలంలోని చెరువుల అభివృద్ధి పనులకు 47.60 లక్షల రూపాయలు నిధులు మంజూరైనట్లు ఇరిగేషన్ శాఖ ఏఈ మహేందర్ తెలిపారు. ఆ పనులకు సంబంధించి నివేదికలను కోరిన మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి చెరువు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యాల చూడాలన్నారు. వింజమూరు మండలంలోని నల్లగొండ్ల బొడ్డు వాగు చెరువుకు 4.95 లక్షలు తక్కెళ్ళపాడు, చెరువుకు 4.45 లక్షలు చంద్రపడియ, చెరువుకు 4.75లక్షలు శంఖవరం, చెరువుకు 4.50 లక్షలు బుక్కాపురం, చెరువుకు4.95 లక్షలు మోటచింతలపాలెం రామలింగారెడ్డి చెరువుకు 4.50 లక్షలు ఎర్రబెల్లి పాలెం, చెరువుకు 4.85 లక్షలు ఏ కిస్తీపురం, చెరువుకు 4.85 లక్షలు వింజమూరు మలపరాజు వాగు చెరువుకు 4.95 లక్షలు బుక్కాపురం పెద్ద చెరువు 4.90 లక్షలు రూపాయలు మంజూరైనట్లు తెలిపారు. శంఖవరం చెరువు పనులు ప్రారంభమయ్యాయి అన్నారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలు వేయడం, తూములు, అలుగులు, పనులు, సప్లై ఛానల్ పనులు, పంట కాలువల పనులు అవసరం నిమిత్తం చేయడం జరుగుతుందన్నారు.


