_*కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కోటేకల్ వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాద ఘటనపై ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద స్థలాన్ని చేరుకుని ఘటనను స్వయంగా పర్యవేక్షించిన ఎమ్మిగనూరు శాసన సభ్యులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు, అక్కడి పరిస్థితులను స్థానికులతో, అధికారులతో తెలుసుకున్నారు.*_
– _*రోడ్డు ప్రమాదం పై సంబంధిత అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించిన ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు, ప్రమాదంలో గాయపడిన వారికి తక్షణం మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.*_
– _*రెండు కార్లు ఢీకొన్న ఈ భయానక ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు మృతి చెందడం ఎంతో బాధాకరమని ఎమ్మెల్యే డాక్టర్ బీవి జయనాగేశ్వర్ రెడ్డి గారు విచారం వ్యక్తం చేశారు.*_
– _*మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు తెలిపారు.*_


