ఎమ్మిగనూరు పట్టణ అభివృద్ధికి మరో ముందడుగు.. రూ.303.38 లక్షలతో పలు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు పట్టణంలో CC రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టులు, స్టోర్మ్ వాటర్ డ్రైనేజీలు, HDPE డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్లు, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే డా. బి.వి. జయ నాగేశ్వర రెడ్డి గారు పలు ప్రాంతాల్లో భూమి పూజ చేశారు.
29వ వార్డు మిలిటరీ కాలనీ, అర్బన్ హెల్త్ సెంటర్ సమీపంలో CC డ్రైనేజీలు, కల్వర్టులు, డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్, ELSR ట్యాంక్ సమీపంలో కాంపౌండ్ వాల్ పనులు చేపట్టనున్నారు.
30, 31వ వార్డుల MS నగర్, ఎల్లమ్మ బీడు ప్రాంతంలో స్టార్మ్ వాటర్ డ్రైనేజీ, కల్వర్టు, పైప్‌లైన్ పనులు; 33వ వార్డు సంజీవయ్య నగర్, హనుమాన్ నగర్‌లో CC డ్రైనేజీలు, కల్వర్టుల పనులు చేపట్టనున్నారు.
అలాగే 7వ వార్డు హుస్సేనప్ప కొట్టాల, బాబు జగ్జీవన్ రామ్ కాలనీ, మారెమ్మ దేవాలయం ప్రాంతాల్లో CC రోడ్లు, కాంపౌండ్ వాల్ పనులు చేపట్టనున్నారు.
15, 22, 23వ వార్డులలోని గాంధీనగర్, మునెప్ప నగర్, రాధాకృష్ణ కాలనీలలో స్టార్మ్ వాటర్ డ్రైనేజీలు, కల్వర్టులు, HDPE డిస్ట్రిబ్యూషన్ పైప్‌లైన్ పనులు చేపట్టనున్నారు. *మొత్తం రూ.303.38 లక్షల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమం చేపట్టారు*.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, భూమి పూజ చేసిన పనులను వెంటనే ప్రారంభించి త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పైప్‌లైన్ పనులు పూర్తయిన అనంతరం ఎమ్మిగనూరు ప్రజలకు 24 గంటల తాగునీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.
రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ఎమ్మిగనూరును మరింత అభివృద్ధి చెందిన పట్టణంగా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ప్రజల అవసరాలను గుర్తించి.. మాటల్లో కాదు, పనుల్లో అభివృద్ధిని చూపిస్తూ ముందుకు సాగుతున్నాం! అని ఎమ్మెల్యే గారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కుర్ని కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ కమిషనర్, డీఈ మరియు సిబ్బంది, టీడీపీ పట్టణ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు, వార్డు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.
#DrBVJayaNageswaraReddy #Yemmiganur #TDP #KutamiGovernment #24HoursDrinkingWater #Roads #Drainage #WaterSupply #UrbanDevelopment #NDA #Development #PublicWelfare
