ఎమ్మిగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేసేలా ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి గారు ఎమ్మిగనూరు మండల ప్రధాన కమిటీని నియమించారు. టీడీపీ మండల ప్రధాన కమిటీ అధ్యక్షుడిగా తిమ్మాపురానికి చెందిన వెంకటేష్ మరియు ఉపాధ్యక్షుడిగా కందనాతికి చెందిన కేశన్నను నియమించారు. వీరితో పాటు ప్రధాన కార్యదర్శిగా పర్లపల్లికి చెందిన రాజేశ్‌ను, మండల ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా చెన్నారెడ్డి, అయ్యలప్ప, విజయ్ గౌడ్ మరియు మండల కార్యదర్శులుగా సయ్యద్ తాజుద్దీన్, డీలర్ ఈరన్న, తెలుగు సోమశేఖర్‌తో పాటు మండల కోశాధికారిగా బోయ పార్వతిని నియమించారు.



