శ్రీకాళహస్తి, మార్చి 14, పున్నమి న్యూస్: ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్రంలోని (ఎఫ్‌టీసీసీఐ) భవనంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ కన్స్యూమర్ రైట్స్ కమిషన్ స్టేట్స్ సెక్రటరీగా సేవలందిస్తున్న దామా విజయకుమార్‌కు విశిష్ట సత్కారం లభించింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖుల సమక్షంలో ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందజేసి ఘనంగా సన్మానించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తూ ప్రజల్లో అవగాహన పెంపొందించడంలో దామా విజయకుమార్ చేస్తున్న సేవలను కార్యక్రమానికి హాజరైన అతిథులు ప్రశంసించారు. వినియోగదారుల హక్కుల పరిరక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న దామా విజయకుమార్ భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మిత్రులు, శ్రేయోభిలాషులు ఆకాంక్షిస్తూ అభినందనలు తెలియజేశారు.

ఎఫ్‌టీసీసీఐ వేదికగా దామా విజయకుమార్‌కు విశిష్ట సత్కారం