*ఎపిలో మెరైన పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పండి*
*సాగర్ డిఫెన్స్ ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ*
*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి: మానవ రహిత సముద్ర వ్యవస్థలు, అటానమస్ వెసల్స్, డిఫెన్స్ సొల్యూషన్స్ లో పేరెన్నికగన్న సాగర్ డిఫెన్స్ సంస్థ ప్రతినిధులు రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. 2015లో ఏర్పాటైన ఈ సంస్థ సముద్ర భద్రత, నిఘా, పర్యావరణ పరిరక్షణ కోసం అత్యాధునిక ప్లాట్ ఫాంలను డిజైనింగ్, తయారీ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ… భారత్ ను మెరైన్ రోబోటిక్స్, డిఫెన్స్ ఇన్నొవేషన్ లో అగ్రగామిగా నిలపడమే తమ లక్ష్యమని అన్నారు. దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు స్వదేశీ సాంకేతికతకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. మెరైన్ రోబోటిక్స్, నావిగేషన్ వ్యవస్థలలో తాము మల్టిపుల్ పేటెంట్లను కలిగి ఉన్నట్లు చెప్పారు. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ… 1057 కి.మీ.ల సువిశాల తీరప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ లో అత్యాధునిక మెరైన్ పరికరాల తయారీ యూనిట్ నెలకొల్పాల్సిందిగా కోరారు. ఎఐ, ఐఓటి, స్వయం ప్రతిపత్తి వ్యవస్థలపై దృష్టిసారించాల్సిందిగా సూచించారు.


