విశాఖపట్నం, అక్టోబర్ 22:
ఎన్ఏడి కొత్తరోడ్డు ఆల్ఫా హోటల్ నుండి బాజీజంక్షన్ వరకు ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, బాజీజంక్షన్ కొబ్బరిబొండాలు షాప్ వెనుక నుండి ఎన్ ఏ డి కొత్తరోడ్డు సులభకంప్లెక్స్ వరకు ఉన్న ప్రత్యామ్నాయ రోడ్డును అభివృద్ధి చేయడానికి చర్యలు ప్రారంభమయ్యాయి.
ఈ రహదారి గుంతలు, రాళ్లతో ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ గణబాబు సూచన మేరకు, జివిఎంసి నిధులు మంజూరు చేయించేందుకు 90వ వార్డ్ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ సభ్యులు బొమ్మిడి రమణ చొరవ తీసుకున్నారు.
ఆ మార్గం వాడుకలోకి రావడం కోసం ఆక్రమణకు గురైన రహదారికి ఇరువైపులా ఉన్న స్థలాలను క్లియర్ చేయించేందుకు టౌన్ ప్లానింగ్ ఇంజనీరింగ్ అధికారులతో కలిసి పర్యటన నిర్వహించారు.
పర్యటనలో పాల్గొన్న వారు:
90వ వార్డ్ ప్రెసిడెంట్ శరగడం అరుణ్
మాజీ వార్డ్ ప్రెసిడెంట్ యలమంచిలి ప్రసాద్
టౌన్ ప్లానింగ్ ఏ సి పి రామలింగేశ్వర రెడ్డి
సర్వేయర్ కుమార్ స్వామి
ఇంజనీరింగ్ విభాగం డి ఈ వెంకటలక్ష్మి
వర్క్ సూపర్వైజర్ సోమేశ్
సానిటరీ ఇన్‌స్పెక్టర్ బుచ్చిబాబు
91వ వార్డ్ ప్రెసిడెంట్ సత్తిరాజు
టీడీపీ నాయకులు నరవ అనూష, మార్కెటింగ్ డైరెక్టర్ ఉప్పాటి శివ, జే ఎన్ టి యు ఉప్పిలి రామకృష్ణ , 51 బూత్ ఇంచార్జి శ్రీను పట్నాయక్, తెలుగు యువత ఆర్గనైజింగ్ సెక్రటరీ పోతల సతీష్, యూత్ సెక్రటరీ బావరాజు సతీష్, బీసీ సెల్ ప్రెసిడెంట్ నమ్మి రవి తదితరులు పాల్గొన్నారు.
ఈ చర్యలతో NAD పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలకు కొంత ఊరట లభించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.


